ముంబై: ఇటీవల చోటుచేసుకున్న రెండు ఘటనలు తనను ఒకింత షాక్ గురిచేశాయని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రతీ జింతా చెప్పింది. అందులో ఒకటి ఒక మహిళ తన కుమార్తెను గట్టిగా హత్తుకుని, ముద్దుపెట్టి పారిపోయిన ఘటన కాగా, మరోటి ఓ దివ్యాంగుడు డబ్బులు అడుక్కోవడానికి తన కారును వెంబడించడమని తెలిపింది.
ఒక మహిళ తమ దగ్గరికి వచ్చి తన కుమార్తె ఫొటో తీసుకుంటానని అడిగిందని, అందుకు తాను అంగీకరించకపోవడంతో ఆ మహిళ ఒక్కసారిగా తన కుమార్తెను గట్టిగా హత్తుకుని, మూతి పక్కన ముద్దుపెట్టి్ందని చెప్పింది. ఆ ఘటన తనను షాక్‌కు గురిచేసిందని, షాక్ నుంచి తేరుకునే లోపే ఆ మహిళ పారిపోయిందని వెల్లడించింది.
మరో ఘటనలో తాను కారులో ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఒక దివ్యాంగుడు వీల్‌చైర్‌లో తన కారు దగ్గరికి వచ్చాడని, తాను డబ్బులు లేవని చెప్పినా వినిపించుకోలేదని అన్నారు. తన పక్కనున్న మహిళ ఆమె పర్సు నుంచి కొంత చిల్లర తీసి ఇస్తే అది సరిపోదని విసిరికొట్టాడని, తాను వెళ్తుంటే వీల్‌చైర్‌తో వెంబడించాడని చెప్పింది. ఆ ఘటన కూడా తనను షాక్‌కు గురిచేసిందని తెలిపింది.