గర్భిణీ పులిని సజీవ దహనం చేసిన వేటగాళ్లు

ఆదిలాబాద్ : గర్భంతో ఉన్న పులిని వేటగాళ్లు సజీవ దహనం చేశారు. ఈ దారుణమైన సంఘటన గత సోమవారం మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలోని పంధర్కావాడ తాలూకాలోని జారీ-జామ్నీ గ్రామాల సమీపంలో చోటుచేసుకుంది. గర్భిణీ పులిని కల్వర్టు లోపల లాక్ చేసి వేటగాళ్ళు సజీవ దహనం చేశారు. పులి గర్భంలో నాలుగు పిల్లలు ఉన్నట్లుగా సమాచారం. వేగిన్ అనే ఈ పులి ముందు పంజాలను వేటగాళ్ళు కత్తిరించుకుపోయారు.
నాలుగేళ్ల యవసున్నపులి సోమవారం ఉదయం కల్వర్టులో చనిపోయి ఉండటాన్ని ఓ అటవీ నివాసి గమనించాడు. దీంతో అధికారులకు సమాచారం అందివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇనుప చువ్వలను అమర్చడం ద్వారా కల్వర్టులోంచి పులి పారిపోకుండా చూశారు. అనంతరం నిప్పంటించి సజీవ దహనం చేశారు. అది చనిపోయిందా లేదా అని తెలుసుకునేందుకు పదునైన ఆయుధాలతో పొడిచి చూశారు.
చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత దాని పంజాలను తొలగించి తీసుకెళ్లారు. తాపేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం (టీడబ్ల్యుఎస్)లో ఈ హత్య ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉండటంతో స్థానిక అటవీవాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. టీడబ్ల్యూఎస్కు చెందిన పెద్ద పులులు ఎక్కువగా కవ్వాల్ టైగర్ రిజర్వ్‌కు వలస వస్తుంటాయి. ఈ ఘటనపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ పులుల పరిరక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా అటవీ అధికారులను కోరుతున్నారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

