Road Accident | టెంపోను ఢీకొట్టిన ట్యాంకర్.. ఎనిమిది మంది మృత్యువాత..!
Road Accident | గ్యాస్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ టెంపో వాహనాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. పలువురు గాయపడ్డారు. ట్యాంకర్ బోల్తాపడడంతో గ్యాస్ లీక్కావడంతో ఒక్కసారిగా కలకలం సృష్టించింది.
Road Accident | గ్యాస్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ టెంపో వాహనాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. పలువురు గాయపడ్డారు. ట్యాంకర్ బోల్తాపడడంతో గ్యాస్ లీక్కావడంతో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లోని లీలాపూర్‌లో సోమవారం చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. లీలాపూర్ వద్ద టెంపో ప్రతాప్‌గఢ్ వైపు వెళ్తుండగా.. ట్యాంకర్ మోహన్‌గంజ్ వైపు వస్తున్నది. వేగంగా వచ్చిన ట్యాంకర్ టెంపోను ఢీకొట్టింది.
టెంపోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టెంపోను ఢీకొట్టిన అనంతరం గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడింది. గ్యాస్ లీక్ కావడంతో వాహనాలు నిలిచిపోయాయి. గ్యాస్ లీకేజీతో ఒక్కసారిగా సంఘటనా స్థలంలో కలకలం సృష్టించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, మృతులకు సంబంధించిన సమాచారం తెలియరాలేదని, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారనే వివరాలు తెలియదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

