Groom Hostage | యువతీ యువకుల పెళ్లికి కుటుంబీకులు సర్వం సిద్ధం చేశారు. వేడుకకు బంధువులంతా తరలివచ్చారు. ఊరేగింపుతో వరుడితో సహా కుటుంబీకులు వధువు ఇంటికి తరలివచ్చారు. కొద్ది క్షణాల్లో వధువు మెడలో జయమాల వేసే సమయం ఆసన్నమైంది. అంతలోనే పెళ్లి కొడుకు అదనపు కట్నం డిమాండ్ చేశాడు. ఎంతసేపు వరుడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అనడంతో వధువు కుటుంబం చివరకు వరుడిని చెట్టుకు కట్టేసింది.
అలాగే వరుడి తరఫున వచ్చిన చాలా మంది అతిథులు సైతం బందీలుగా మారారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రోజంతా పంచాయితీ జరిగినా చివరకు ఫలితం లేకపోయింది.
प्रतापगढ़
➡दहेज मांगने पर दूल्हे को पेड़ से बांधा
➡दूल्हे के रिश्तेदारों को भी बनाया गया बंधक
➡जयमाल के बाद दहेज को लेकर हुआ विवाद
➡जौनपुर जिले के सुजानगंज से आई थी बारात
➡दूल्हे को पेड़ से बांधने का वीडियो हुआ वायरल
➡सूचना पर पहुंची पुलिस मामले की जांच में जुटी… pic.twitter.com/hExglRciD7
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) June 15, 2023