Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు ఆరు రోజుల ఎస్ఐటీ కస్టడీ..!
Prajwal Revanna | అశ్లీల వీడియోల కేసులో జేడీఎస్ సస్పెండెడ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటకలోని దిగువ న్యాయస్థానం జూన్ ఆరో తేదీ వరకూ స్పెషల్ ఇన్వెస్ట్‌గేషన్ టీం (ఎస్ఐటీ) కస్టడీ విధించింది.
Prajwal Revanna | అశ్లీల వీడియోల కేసులో జేడీఎస్ సస్పెండెడ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటకలోని దిగువ న్యాయస్థానం జూన్ ఆరో తేదీ వరకూ స్పెషల్ ఇన్వెస్ట్‌గేషన్ టీం (ఎస్ఐటీ) కస్టడీ విధించింది. తన ఇంటి పని సహాయకురాలిపై లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులకు పాల్పడిన కేసులో ప్రజ్వల్ రేవణ్ణను.. విమానంలో విదేశాల నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే పోలీసు అధికారులు అరెస్ట్ చేసి సీఐడీ ఆఫీసుకు తరలించారు. డిప్లమాటిక్ పాస్ పోర్ట్‌పై జర్మనీ రాజధాని బెర్లిన్‌కు వెళ్లిన నెల రోజుల తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే ఆయన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ (33) నెల రోజుల పాటు దర్యాప్తు అధికారులు జారీ చేసిన సమన్లను తప్పించుకున్నారు. హసన్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. బెంగళూరు విమానాశ్రయానికి రాగానే అరెస్ట్ చేసేందుకు వీలుగా మహిళా పోలీసుల టీంకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో అనుమానితులుగా ఉన్న నవీన్ గౌడ, చేతన్ లను అంతకుముందే సీఐటీ పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. అయితే వారు తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ నుంచి మహిళను లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు గల పెన్ డ్రైవ్‌లను నవీన్ గౌడ, చేతన్ గౌడ పంపిణీ చేశారన్న కేసులో వారిని అరెస్ట్ చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి.
#WATCH | Bengaluru | Obscene videos case: Suspended JD(S) leader Prajwal Revanna remanded to six days police custody pic.twitter.com/Q2QhBmQEEK
— ANI (@ANI) May 31, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

