ఆసుపత్రిలో అడ్మిట్‌కు.. పాజిటివ్ రిపోర్ట్ తప్పనిసరికాదు

న్యూఢిల్లీ: ఆసుపత్రిలో రోగుల అడ్మిట్‌కు కరోనా పాజిటివ్ రిపోర్ట్ తప్పనిసరి కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోగులను ఆసుపత్రిలో చేర్చుకోకపోవడం వంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో రోగుల అడ్మిషన్ నిబంధనలను శనివారం సడలించింది. కరోనా సెకండ్ వేవ్‌తో దేశం పోరాడుతున్న ఈ క్లిష్ట సమయంలో ఏ రోగిని కూడా ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించకూడదని పేర్కొంది. రోగి మరో ప్రాంతానికి చెందినప్పటికీ ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోవాలని, ఆక్సిజన్, అవసరమైన మందులతో వైద్య చికిత్స అందించాలని సూచించింది.
ఒకవేళ రోగికి కరోనా సోకి ఉంటుందని అనుమానంగా ఉంటే కరోనా వార్డు, లేదా కేంద్రంలో ఉంచి వైద్య చికిత్స అందించాలని, ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకపోతే ధ్రువీకరణ కోసం డిమాండ్ చేయకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. “ఆసుపత్రిలో ప్రవేశాలు తప్పనిసరిగా అవసరాన్ని బట్టి ఉండాలి. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని వ్యక్తులతో పడకలు ఆక్రమించకుండా చూసుకోవాలి. కరోనాతో బాధపడుతున్న రోగులకు సత్వర, సమర్థవంతమైన, సమగ్ర చికిత్సను అందించే లక్ష్యంగా ఆసుపత్రులు పనిచేయాలి ” అని ప్రకటనలో పేర్కొంది.
ఈ కొత్త నిబంధనలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేటు ఆసుపత్రులకు వర్తిస్తాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిని మూడు రోజుల్లో అమలు చేసేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు ఆ మేరకు ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

