Ponmudi | సుప్రీంకోర్టు చీవాట్లతో దిగొచ్చిన తమిళనాడు గవర్నర్.. మళ్లీ తమిళనాడు క్యాబినెట్లోకి పొన్ముడి
Ponmudi | సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడంతో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి దిగొచ్చారు. తమిళనాడు మాజీ మంత్రి పొన్ముడితో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించేందుకు అంగీకరించారు. అక్రమాస్తుల కేసులో పొన్ముడికి గతంలో జైలుశిక్ష పడింది. దాంతో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయింది. హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ పొన్ముడి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. సర్వోన్నత న్యాయస్థానం పొన్ముడికి హైకోర్టు విధించిన శిక్షను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

దాంతో పొన్ముడి ఎమ్మెల్యేగా కొనసాగుతారని తమిళనాడు స్పీకర్ ప్రకటించారు. ఆ వెంటనే సీఎం స్టాలిన్ పొన్ముడి పేరును మంత్రిగా సిఫారసు చేశారు. అయితే అందుకు గవర్నర్ నిరాకరించారు. దాంతో స్టాలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్టాలిన్ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గవర్నర్ ఆర్ఎన్ రవికి చీవాట్లు పెట్టింది. తాము ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం సాయంత్రం లోపు పొన్ముడిని మంత్రిగా నియమించడంపై నిర్ణయం తీసుకోవాలని డెడ్లైన్ పెట్టింది.
దాంతో గవర్నర్ ఆర్ఎన్ రవి దిగొచ్చారు. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు సమ్మతి తెలిపారు. కోర్టు తీర్పును ధిక్కరించాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. గత పరిణామాల ఆధారంగానే తాను పొన్ముడితో మంత్రిగా ప్రమాణం చేయించలేదని వివరణ ఇచ్చారు. గవర్నర్ ఆర్ఎన్ రవి పొన్ముడితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి