ఢిల్లీలో రాజకీయ చిచ్చు!
- రాజధాని పాలనాధికారాలపై కేంద్రం కొత్తబిల్లు
- రాష్ట్రసర్కార్ అధికారాల్ని తొలిగించటానికే ఆ బిల్లు తెచ్చారంటూ కేజ్రీవాల్ ధ్వజం
న్యూఢిల్లీ, మార్చి 16: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం తరఫున పని చేసే లెఫ్టినెంట్ గవర్నర్కు (ఎల్జీకి), ప్రజల ఓట్లతో ఎన్నికైన రాష్ట్రప్రభుత్వానికి మధ్య మరోమారు చిచ్చు రగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఢిల్లీపై ఎల్జీ, రాష్ట్రసర్కార్లలో ఎవరికి కీలక అధికారాలన్న వివాదం.. కేంద్రం తీసుకొచ్చిన తాజా బిల్లుతో మరింత ముదిరేలా ఉంది. ఢిల్లీ పాలనాధికారాలకు సంబంధించిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ’ (జీఎన్సీటీడీ) చట్టంలో సవరణలను ప్రతిపాదిస్తూ ఒక బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సవరణల వల్ల ఇప్పటికే తమకున్న పరిమితస్థాయి అధికారాలు కూడా లేకుండా పోతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నారు. ఢిల్లీలో ప్రజాప్రభుత్వం అధికారాలకు కత్తెర వేయడానికి కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రే ఈ సవరణలని ఆప్ నాయకులు మండిపడుతున్నారు. ఈ మేరకు ఈ బిల్లుపై కేజ్రీవాల్ నాయకత్వంలో ఆప్ ఎంపీలు, ఎమ్మెల్యేలు బుధవారం జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపనున్నారు.
ఢిల్లీ ప్రజల్ని అవమానించటమే: చిదంబరం
కేంద్ర ప్రభుత్వం చేయనున్న సవరణలు అప్రజాస్వామికమే కాక హానికరమైనవి కూడా అని కాంగ్రెస్ నేత పి చిదంబరం విమర్శించారు. ఈ మార్పులతో ఢిల్లీ ప్రభుత్వ స్థాయి ఓ మున్సిపాలిటీ కన్నా తక్కువైపోతుందని చెప్పారు. ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం నియమించే లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అపరిమిత అధికారాలతో వైస్రాయ్గా మారుతారన్నారు. తన ప్రభువు (కేంద్రం) అభీష్టం ప్రకారం ఎల్జీ తన అధికారాలను ఉపయోగిస్తారని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

