కారులో పోలీసుల డ్యాన్స్ అదుర్స్.. వెంటనే సస్పెండ్ చేసిన ఎస్పీ: వీడియో వైరల్

డ్యాన్స్ అనేది కామన్. ఎవరికి ఎప్పుడు డ్యాన్స్ చేసే మూడ్ వస్తుందో చెప్పలేం. ఎంజాయ్మెంట్లో డ్యాన్స్ అనేది ఒక భాగం. డ్యాన్స్‌ను ఎవరైనా చేయొచ్చు.. ఎప్పుడైనా చేయొచ్చు కానీ.. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులను దాటితే ఇదిగో ఇలాగే అవుతుంది. ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఉత్తపుణ్యానికి సస్పెండ్‌కు గురయ్యారు. వాళ్లు చేసిన పని ఏంటో తెలుసా? కారులో డ్యాన్స్ వేయడం. అయినా కారులో డ్యాన్స్ వేస్తే సస్పెండ్ చేస్తారా? అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది.
కానీ.. వాళ్లను సస్పెండ్ చేసి కారులో డ్యాన్స్ చేసినందుకు కాదు.. కారులో కూర్చొని ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు. పోలీస్ డ్రెస్ వేసుకొని సరిగ్గా ప్రవర్తించనందుకు. అది పోలీస్ డ్రెస్‌కు అవమానం అని భావించి.. పోలీస్ ఉన్నతాధికారులు వాళ్లను సస్పెండ్ చేశారు.
ఈ ఘటన గుజరాత్‌లోని కచ్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది కాస్త.. పోలీస్ ఉన్నతాధికారులకు చేరింది. ఆ వీడియోలో కారులో డ్యాన్స్ వేసిన పోలీసులు.. ముఖానికి మాస్క్ ధరించకుండా.. కనీసం సీటు బెల్టు కూడా పెట్టుకోకుండా ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించారు. పోలీస్ డ్రెస్‌లో ఉండి కారులో డ్యాన్స్ వేయడమే కాకుండా.. ఇలా రూల్స్‌ను బ్రేక్ చేశారని.. ఉన్నతాధికారులు వాళ్లను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
వాళ్లు ముగ్గురూ గాంధిధామ్ డివిజన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్నారు. ఆ వీడియోను కారులో కూర్చున్న ఓ పోలీస్ తీసి.. తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వాళ్ల జాబ్‌లకే ఆ వీడియో ఎసరు పెట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

