quadruple murders | ముగ్గుర్ని హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు వేట.. నాలుగో మృతదేహం లభ్యం
quadruple murders | ముగ్గురిని హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు వెతుకుతుండగా అతడు హత్య చేసిన నాలుగో మృతదేహం లభించింది (quadruple murders) . దీంతో నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీస్, పీఏసీ, ఎస్డీఆర్ఎఫ్తో కూడిన 60 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. డ్రోన్లు, డాగ్ స్క్వాడ్ సహాయంతో కొండలు, లోయలు, నదీ తీర ప్రాంతాల్లో సర్చ్ చేశారు.
డెహ్రాడూన్: ముగ్గురిని హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు వెతుకుతుండగా అతడు హత్య చేసిన నాలుగో మృతదేహం లభించింది (quadruple murders) . ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. సంతోష్ రామ్ కుటుంబంలో శుక్రవారం ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో 68 ఏళ్ల అత్త హేమంతి దేవి, ఆమె కుమార్తె, కోడలిని అతడు హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడి కోసం వెతకసాగారు. అయితే అతడు ఇటీవల కొనుగోలు చేసిన పాత ఇంటికి తాళం వేసి ఉంది. పిల్లలు తాళం పగులగొట్టి లోనికి వెళ్లి చూగా సంతోష్ రామ్ భార్య చంద్రా దేవి మృతదేహం ఆ ఇంట్లో ఉంది. దీంతో నిందితుడు నలుగురిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
కాగా, సంతోష్ రామ్‌ను వెతికేందుకు పోలీస్, పీఏసీ, ఎస్డీఆర్ఎఫ్తో కూడిన 60 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. అలాగే డ్రోన్లు, డాగ్ స్క్వాడ్ సహాయంతో కొండలు, లోయలు, నదీ తీర ప్రాంతాల్లో సర్చ్ చేశారు. రామగంగా నది ప్రవహించే ఎత్తైన కొండల వైపునకు కుక్కలు వెళ్లాయి. దీంతో నిందితుడు సంతోష్ రామ్ కొండ పైనుంచి ఆ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ నదీ తీర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. కుటుంబంలోని నలుగురిని హత్య చేసిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

