పోలీసుల చొరవ : దవాఖానకు 3 గంటల్లో 20 ఆక్సిజన్ సిలిండర్ల తరలింపు

చెన్నై : కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి నెలకొన్న క్రమంలో చెన్నై పోలీసులు సకాలంలో ఆక్సిజన్ సిలిండర్లను తరలించి కరోనా రోగుల ప్రాణాలను కాపాడారు. కొలత్తూర్ లోని ఓ ప్రైవేట్ దవాఖానలో మెడికల్ ఆక్సిజన్ నిండుకుందని, పది మంది కొవిడ్-19 రోగులకు ఆక్సిజన్ అవసరమని అక్కడి వైద్యుడు పోలీసులకు ఫోన్ చేశారు.
దవాఖానకు ఆక్సిజన్ సరఫరా చేయాల్సిన సంస్థ స్పందించకపోవడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. కాల్ అందుకున్న ఏసీపీ పీ స్టీఫెన్ సత్వరమే స్పందించి దవాఖానకు చేరుకోగా అక్కడ కేవలం ఒకే ఒక సిలిండర్ అందుబాటులో ఉంది. పోలీసుల టీం చొరవ చూపి కేవలం మూడు గంటల్లోనే ఆస్పత్రికి 2ం ఆక్సిజన్ సిలిండర్లను తరలించింది. ఆక్సిజన్ సిలిండర్లను తయారుచేసే కంపెనీలతో తమకున్న పరిచయాలతో వెంటనే తెప్పించగలిగామని స్టీఫెన్ వెల్లడించారు. ఇక పోలీసులు సకాలంలో స్పందించి తమ ఆప్తుల ప్రాణాలు కాపాడారని కొవిడ్ రోగుల బంధువులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Chennai
- Oxygen Cylinder
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

