Infinity Forum: ఇన్ఫినిటీ ఫోరమ్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Infinity Forum: ఫిన్‌టెక్‌పై థాట్ లీడర్షిప్ ఫోరమ్ అయిన ఇన్ఫినిటీ ఫోరమ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించనున్నారు.

న్యూఢిల్లీ: ఫిన్‌టెక్‌పై థాట్ లీడర్షిప్ ఫోరమ్ అయిన ఇన్ఫినిటీ ఫోరమ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించనున్నారు. GIFT సిటీ, బ్లూమ్‌బర్గ్ భాగస్వామ్యంతో 2021, డిసెంబర్ 3, 4 తేదీల్లో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (IFSCA) ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఈ ఇన్ఫినిటీ ఫోరమ్ మొదటి ఎడిషన్‌లో ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, UK భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా విధానాలు, వ్యాపారం, సాంకేతికతలో ప్రముఖులైన వ్యక్తులను ఈ ఇన్ఫినిటీ ఫోరమ్ ఒక్కచోట చేరుస్తుంది. సమ్మిళిత వృద్ధికి, మానవాళి సేవకు ఫిన్‌టెక్ పరిశ్రమ ద్వారా సాంకేతికత, ఆవిష్కరణలను ఎలా ఉపయోగించవచ్చనే అంశంపై ఆ ప్రముఖుల చర్చకు, కార్యాచరణకు ఈ ఇన్ఫినిటీ ఫోరమ్ తోడ్పడుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- fintech
- Infinity Forum
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

