నలుగురు ముఖ్యమంత్రులకు ప్రధాని ఫోన్.. కొవిడ్ పరిస్థితులపై ఆరా

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నలుగురు ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులపై ఆరా తీశారు. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ల ముఖ్యమంత్రులు ఉద్ధవ్ థాక్రే, ఎంకే స్టాలిన్, శివరాజ్‌సింగ్ చౌహాన్, జైరామ్ ఠాకూర్లకు ప్రధాని ఫోన్ చేసి మాట్లాడారు. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌కు తొలుత ప్రధాని ఫోన్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రానికి వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించడానికి కేంద్రం అనుమతి కోరిన రోజే ఉద్ధవ్‌తో మోదీ మాట్లాడారు.
ఇక ప్రధానితో మాట్లాడిన తర్వాత ఆ వివరాలను ట్విటర్లో వెల్లడించారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. తమ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతూ, రికవరీ రేటు పెరుగుతున్నట్లు చౌహాన్ చెప్పారు. తమ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారని, అవసరమైన సాయం అందిస్తామని చెప్పినట్లు ఆ ట్వీట్లో తెలిపారు. శుక్రవారం కూడా ప్రధాని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఫోన్ చేయడం.. దీనిపై సోరెన్ విమర్శలు గుప్పించడం, దానికి ఏపీ సీఎం జగన్ కౌంటర్ వేయడం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూమిని ఢీకొట్టనున్న నాసా టెలిస్కోస్
Telangana | మళ్లీ అంధకారంలోకి తెలంగాణ.. డిమాండ్‌కు తగినంతగా లేని విద్యుత్తు సరఫరా!
RS Praveen Kumar | కాంగ్రెస్ ఎంపీ భూ బాగోతం.. వెయ్యి కోట్ల ల్యాండ్ స్కామ్ బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Rythu Bharosa | రైతు భరోసాపై సర్కార్ డ్రామా!.. ఖాతాలో పైసలు వేశామంటూ ఫేక్ మెసేజ్‌లతో బురిడీ కొట్టించిన రేవంత్ సర్కార్
Congress | అసలు కాంగ్రెస్ కాదిది కబ్జా కాంగ్రెస్.. సచివాలయంలో ఓ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

