PM Modi whishes | బ్రిటన్ ఎన్నికల్లో విజేతగా నిలిచిన కైర్ స్టార్మర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
PM Modi whishes | బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో (UK general elections) విజేతగా నిలిచిన లేబర్‌పార్టీ (Labour party) అభ్యర్థి కైర్ స్టార్మర్ (Keir Starmer) కు ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖతాలో ఒక పోస్ట్ పెట్టారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం యూకేతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ పోస్టులో పేర్కొన్నారు.
PM Modi whishes : బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో (UK general elections) విజేతగా నిలిచిన లేబర్‌పార్టీ (Labour party) అభ్యర్థి కైర్ స్టార్మర్ (Keir Starmer) కు ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖతాలో ఒక పోస్ట్ పెట్టారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం యూకేతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ పోస్టులో పేర్కొన్నారు.
‘యూకే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కైర్ స్టార్మర్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. యూకేతో పరస్పర వృద్ధిని, శ్రేయస్సును పెంపొందించే అన్ని రంగాల్లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వా్మ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు మేము సానూకూల, నిర్మాణాత్మక సహకారం కోసం ఎదురు చూస్తున్నాం’ అని మోదీ తన ఎక్స్ పోస్టులో రాశారు.
Heartiest congratulations and best wishes to @Keir_Starmer on the remarkable victory in the UK general elections. I look forward to our positive and constructive collaboration to further strengthen the India-UK Comprehensive Strategic Partnership in all areas, fostering mutual…
— Narendra Modi (@narendramodi) July 5, 2024
కాగా, బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. ప్రధాని రిషీ సునక్ ఘోరంగా ఓడిపోయారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత తిరిగి అధికారంలో వచ్చింది. ఆ పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్ బ్రిటన్‌కు నూతన ప్రధాని కాబోతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

