క్వాడ్ భేటీకి బైడెన్ ఆతిథ్యం.. హాజరుకానున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం నిర్వహించనున్న క్వాడ్ సదస్సులో ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన జరిగే ఆ భేటీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్య ఇస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగాలు కూడా హాజరుకానున్నారు. ఈ నలుగురు నేతలు పలు అంశాలపై ప్రత్యక్షంగా చర్చిస్తారని వైట్‌హౌజ్ ఓ ప్రకటనలో తెలిపింది. వారి మధ్య ఉన్న బంధాలు, కోవిడ్19పై పోరాటంలో సహకారంతో పాటు ఇండో పసిఫిక్ వాణిజ్యంపై చర్చిస్తారు.
క్వాడ్ భేటీ తర్వాత ప్రధాని మోదీ 25వ తేదీన న్యూయార్క్‌లోని యూఎన్ జనరల్ అసెంబ్లీలో 76వ సెషన్ సందర్భంగా ప్రసంగం చేయనున్నారు. కోవిడ్19 నుంచి రికవరీ, పునర్ నిర్మాణం, ప్రజల హక్కులను గౌరవించడం లాంటి అంశాలను ఈ ఏడాది థీమ్‌గా యూఎన్ ఎంచుకున్నది. నిజానికి మార్చిలోనే తొలి క్వాడ్ సమావేశాలను బైడెన్ ఏర్పాటు చేశారు. వర్చువల్ రీతిలో ఆ సమావేశాలు జరిగాయి. ఆ భేటీ ద్వారా చైనాకు బలమైన సందేశాన్ని కూడా పంపారు.
2017లో భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు క్వాడ్ కూటమిని ఏర్పాటు చేశాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర మార్గాలను ఫ్రీగా ఉంచేందుకు ఆ దేశాలు కొత్త ప్రణాళికలను రచించాయి. దానిలో భాగంగానే క్వాడ్‌ను ఏర్పాటు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

