GST | జీఎస్టీ ఏడేండ్ల ప్రస్ధానంలో సామాన్యుడికి మేలు : ప్రధాని మోదీ
GST : జీఎస్టీ ఏడేండ్ల ప్రస్ధానంలో పన్ను రేట్లు తగ్గి 140 కోట్ల మంది భారతీయుల జీవితాలు మెరుగుపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
GST : జీఎస్టీ ఏడేండ్ల ప్రస్ధానంలో పన్ను రేట్లు తగ్గి 140 కోట్ల మంది భారతీయుల జీవితాలు మెరుగుపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీఎస్టీతో పలు ప్రయోజనాలు చేకూరాయని ఓ వార్తా సంస్ధ నివేదికను ప్రస్తావిస్తూ ప్రధాని ఎక్స్ వేదికగా వివరాలు పంచుకున్నారు. జీఎస్టీ ప్రవేశపెట్టిన అనంతరం గృహ వినియోగ వస్తువులు తక్కువ ధరకు లభ్యమవుతున్నాయని పేర్కొన్నారు.
జీఎస్టీ అమలు అనంతరం పలు రకాల పిండ్లు, పెరుగు, డిటర్జెంట్ వంటి రోజువారీ వినియోగ వస్తువుల ధరలు తగ్గడంతో సగటు ప్రజలు, పేదల పొదుపు రేట్లు పెరిగాయని చెప్పారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచే క్రమంలో తాము ఈ సంస్కరణలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత టీవీ, డిటర్జెంట్ హెయిర్ ఆయిల్, సోప్ వంటి పలు వస్తువుల ధరలు తగ్గాయని సీబీఐటీ గణాంకాలు వెల్లడించాయి. కాగా, 2017లో జీఎస్టీ అమలు ప్రారంభం కాగా, ఈ ఏడాది జులై 1న నూతన పన్ను వ్యవస్ధ ఏడేండ్ల ప్రస్ధానం పూర్తిచేసుకుంటుంది.
Read More :
Nayanthara | ఒకేచోట కలిసిన కోలీవుడ్, మాలీవుడ్ స్టార్ కపుల్స్.. నయనతార ఫొటోలు వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

