Debendra Pradhan | కేంద్ర మాజీ మంత్రి దేబేంద్ర ప్రధాన్ కన్నుమూత.. ప్రధాని మోదీ నివాళి
Debendra Pradhan | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) ఇంట విషాదం నెలకొంది.
Debendra Pradhan | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి దేబేంద్ర ప్రధాన్ (Debendra Pradhan) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 84. అనారోగ్యం కారణంగా సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం దేబేంద్ర ప్రధాన్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
#WATCH | Delhi | PM Modi pays last respects to former Union Minister Dr Debendra Pradhan who passed away at the age of 84.
Dharmendra Pradhan, the son of former Union Minister and late Dr Debendra Pradhan, present.
(Video source: DD) pic.twitter.com/6MynfHzaWB— ANI (@ANI) March 17, 2025
కాగా, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో దేబేంద్ర ప్రధాన్ మంత్రిగా పనిచేశారు. ఒడిశా బీజేపీ మాజీ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఆయన మృతిపట్ల ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ (Mohan Charan Majhi) స్పందించారు. ఆయన ప్రజా నాయకుడని, సమర్థుడైన పార్లమెంటేరియన్ అని కొనియాడారు. 1999 నుంచి 2001 వరకు కేంద్ర రవాణా, వ్యవసాయ శాఖ మంత్రిగా తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధిగా, ఎంపీగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు.
Dr Debendra Pradhan, a former Union Minister and father of Union Education Minister Dharmendra Pradhan, passes away at the age of 84.
— ANI (@ANI) March 17, 2025
Also Read..
PM Modi Podcast | లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్‌తో ప్రధాని మోదీ పాడ్‌కాస్ట్.. వీడియో షేర్ చేసిన ట్రంప్
Grenade Attack | అమృత్సర్ ఆలయంపై గ్రెనేడ్ దాడి.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు హతం
ISRO Chief: చంద్రయాన్-5 ద్వారా చంద్రుడిపైకి 250 కేజీల రోవర్: ఇస్రో చీఫ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

