పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై సీ-130 విమానంలో దిగిన మోదీ.. వీడియో
Purvanchal Expressway: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్పూర్ జిల్లా కర్వాల్ ఖేరీ వద్ద ప్రధాని నరేంద్రమోదీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. ప్రధాని మోదీ సీ-130 హెర్క్యులస్ విమానంలో

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్పూర్ జిల్లా కర్వాల్ ఖేరీ వద్ద ప్రధాని నరేంద్రమోదీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. ప్రధాని మోదీ సీ-130 హెర్క్యులస్ విమానంలో ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. పూర్వంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై నిర్మించిన ఎయిర్ స్ట్రిప్‌పై ఆ సీ-130 విమానం ల్యాండయ్యింది. ఈ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా పాల్గొన్నారు.
ఈ ఎక్స్‌ప్రెస్ వేను మొత్తం 341 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే లక్నో జిల్లాలో లక్నో-సుల్తాన్పూర్ జాతీయ రహదారిపైగల చౌద్సరాయ్ గ్రామం వద్ద ప్రారంభమై.. ఉత్తరప్రదేశ్-బీహార్ సరిహద్దుకు తూర్పున 18 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి 31 మీదగల హైదరియా గ్రామం వద్ద ముగుస్తుంది. అత్యవసర సమయాల్లో ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్లు ల్యాండ్ అవడానికి, టేకాఫ్ అవడానికి వీలుగా ఈ ఎక్స్‌ప్రెస్ వేపై నిర్మించిన 3.2 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నది.
ప్రస్తుతం ఆరు లేన్లలో నిర్మితమైన ఈ ఎక్స్‌ప్రెస్ వేను భవిష్యత్తులో ఎనిమిది లేన్లకు మార్చనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి అంచనా వ్యయం రూ.22,500 కోట్లు. ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాలు ప్రత్యేకించి లక్నో, బారాబంకీ, అమేథీ, అయోధ్య, సుల్తాన్పూర్, అంబేద్కర్ నగర్, అజాంగఢ్, మవూ, ఘాజీపూర్ జిల్లాల ఆర్థిక ప్రగతికి మరింత ఊతం ఇవ్వడం కోసం ఈ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించారు. ప్రధాని విమానం ఎయిర్ స్ట్రిప్‌పై ల్యాండయిన దృశ్యాలను ఈ కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Prime Minister Narendra Modi reaches Karwal Kheri on C-130 J Super Hercules aircraft to inaugurate the 341 Km long Purvanchal Expressway, shortly
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 16, 2021
(Source: DD) pic.twitter.com/dxQzlC476G
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

