Rahul Gandhi Birthday | పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ X (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. నేటి 56 సంవత్సరంలోకి అడుగుపెట్టిన రాహుల్కు దేశంలోని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రాహుల్కు బర్త్డే విషెస్ తెలిపారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతున్న రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ ప్రజా సేవలో కొనసాగాలని ఖర్గే ఆకాంక్షించారు. కాగా, రాహుల్ గాంధీ జూన్ 19, 1970లో ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో జన్మించారు.