న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కాన్వాయ్(PM Modi Convoy)కు చెందిన సైజును తగ్గించిన విషయం తెలిసిందే. పదలు సంఖ్యలో ఉండే కాన్వాయ్‌లో ఇప్పుడు కేవలం రెండు కార్లు మాత్రమే ఉన్నాయి. ఇటీవల ఢిల్లీలో కేవలం రెండు కార్ల కాన్వాయ్‌తోనే ప్రధాని మోదీ ప్రయాణించారు. ఇంధనం పొదుపు విషయంలో కాన్వాయ్‌లో కార్ల సంఖ్యను తగ్గించారు. అయితే ఆ కాన్వాయ్‌లో రెండు ఎస్‌యూవీలు ఉన్నాయి. ఒకటి రేంజ్ రోవర్. మరొకటి టొయోటా ఫార్చూనర్. సాధారణంగా 10 వాహనాలు ఉండే మోదీ కాన్వాయ్‌లో.. కేవలం రెండు వాహనాలకే కుదించారు. ఇక తన కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపుకు ప్రధాని మోదీ ఆదేశించారు.
రెండు కార్ల కాన్వాయ్‌తో మోదీ వెళ్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంట్లో ఒక కారును రేంజ్ రోవర్ సెంటినల్‌గా గుర్తించారు. సేఫ్టీ ఫ్యూచర్స్‌లో ఈ కారుకు ప్రత్యేక ఉన్నది. ఎస్యూవీ వర్షన్లో ఇది చాలా బలిష్టంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో ఈ కారు ప్రధాని కాన్వాయ్‌లో కూడా ఉంటుంది. వీఆర్8-లెవల్ బాలిస్టిక్ సర్టిఫికేషన్ ఉంది. నేరుగా ఏదైనా వాహనం ఢీకొన్న తట్టుకునే రీతిలో ఈ వాహనం ఉంటుంది. 7.62 ఎంఎం ఆర్మర్ పియర్సింగ్ రౌండ్స్ ఉంటాయి. హై లెవల్ సెక్యూర్టీ వాహనాల్లో ఇదే అత్యున్నత ప్రమాణం కలిగిన వాహనంగా చెప్పుకోవచ్చు. సేఫ్టీ కోసమే దీన్ని ఇంజినీరింగ్ చేసినట్లుగా ఉంటుంది. 15 కేజీల టీఎన్టీ పేలుడును తట్టుకోగలదు. పైనుంచి లేదా కింద నుంచి గ్రేనేడ్ దాడులను తట్టుకునే రీతిలో ఈ కారు నిర్మితమై ఉంది. డిఫెన్స్ కేపాబులిటీతో పాటు అగ్ని ప్రమాదం నివారించే టెక్నాలజీ కూడా దీంట్లో ఉంది. స్మోక్ లేదా గ్యాస్ అటాక్స్ నుంచి రక్షించేందుకు ఆక్సిజన్ సరఫరా కూడా ఉంటుంది. సంక్షోభ సమయంలో కమ్యూనికేషన్ చేసుకునే రీతిలో ఈ కారు నిర్మాణం ఉంది. డిఫెన్స్ సామర్థ్యానికి తగినట్లుగానే.. కారు క్యాబిన్లో లగ్జరీ ఫీచర్లు ఉన్నట్లు తెలిసింది.
ఇక మోదీ కాన్వాయ్‌లో ఉన్న మరో కారు టొయోటా ఫార్చూనర్. జపాన్‌కు చెందిన ఈ ఎస్‌యూవీకు ఆటోమోటివ్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇండియన్ మార్కెట్లో ఇది పాపులర్ మోడల్ కూడా. ప్రధాని మోదీ కాన్వాయ్‌లో ఈ ఎస్యూవీ కూడా భాగమే. దీంట్లో కూడా సేఫ్టీ ఎక్విప్మెంట్ బాగుంటుంది. ఇండియన్ మార్కెట్లో రెండు ఇంజిన్ల ఆప్షన్‌తో దీన్ని అమ్ముతున్నారు. పెట్రోల్ వర్షన్ 2.7 లీటర్ల ఇంజిన్‌తో ఉంది. అది 166 హార్స్పవర్. ఆటోమోటిక్ గియర్‌బాక్స్ ఉంటుంది. ఇక డీజిల్ వేరియంట్‌కు 2.8 లీటర్ల ఇంజిన్ ఉంటుంది. దీని కెపాసిటీ 204 హార్స్పవర్. మాన్యువల్ లేదా ఆటోమెటిక్ వర్షన్లో ఇది దొరుకుతుంది. డీజిల్ వేరియంట్లలో మాత్రమే ఫోర్ వీల్ డ్రైవ్ ఉంది.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi has reduced his convoy size significantly. Reduction in vehicles was done while maintaining essential security components as per SPG protocol. pic.twitter.com/kuC9OfyAxN
— ANI (@ANI) May 13, 2026