Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
Modi Cabinet : రైల్వే శాఖ ఉద్యోగులకు మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం శుభవార్త అందించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల దసరా బోనస్ ప్రకటిస్తూ మోదీ క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది.
Modi Cabinet : రైల్వే శాఖ ఉద్యోగులకు మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం శుభవార్త అందించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల దసరా బోనస్ ప్రకటిస్తూ మోదీ క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ బోనస్ మొత్తం విలువ రూ.2,009 కోట్లుగా ఉంది. పీఎల్బీ (ప్రొడక్టివిటీ లింకుడ్ బోనస్) కింద ఉద్యోగులకు ఈ మొత్తం రైల్వే శాఖ చెల్లించనుంది. ఈ నిర్ణయం ద్వారా 11,40,770 మంది రైల్వే నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
ప్రతి ఏడాది దసరా సందర్భంగా రైల్వే ఉద్యోగులకు కేంద్రం బోనస్ ప్రకటిస్తుంటుంది. ఈ ఏడాది 78 రోజుల బోనస్ ప్రకటించింది. ఒక ఉద్యోగికి గరిష్టంగా రూ.17,951 వరకు అందుతాయి. 78 రోజుల బోనస్ అయినప్పటికీ.. చెల్లింపులపై పరిమితి వల్ల ఈ మొత్తం తక్కువగా ఉంటుంది. దీనిద్వారా ట్రాక్ మెయింటెనర్స్, స్టేషన్ మాస్టర్స్, ట్రైన్ మేనేజర్లు, టెక్నీషియన్లు, లోకోపైలట్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్ హెల్పర్లు, మినిస్టీరియల్ స్టాఫ్, పాయింట్మ్యాన్తోపాటు ఇతర గ్రూప్-సి సిబ్బందికి బోనస్ అందుతుంది. బోనస్ ప్రకటన సందర్భంగా కేంద్ర క్యాబినెట్ కీలక వ్యాఖ్యలు చేసింది.
2025-26 రైల్వే శాఖకు చాలా మంచి సమయం అని, ఈ సమయంలో రైల్వే శాఖ 1,670 మిలియన్ టన్నుల కార్గోను రవాణా చేసిందని తెలిపింది. అలాగే, ఇదే కాలంలో 7.41 బిలియన్ల మంది ప్రయాణికులు రైళ్లో ప్రయాణించారు. ఇక, ఫేక్ బోనస్ లెటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని రైల్వే బోర్డు సంబంధిత ఉద్యోగులకు సూచించింది. మరోవైపు తమకు డీఏ పరిమితిని గరిష్టంగా రూ.18,000 నుంచి పెంచాల్సిందిగా ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్వైజర్స్ అసోసియేషన్ ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. లెవల్2, ఆపై ఉద్యోగులకు వర్తించేలా చూడాలని కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

