ఏడాదికోసారి రివర్ ఫెస్టివల్ జరుపుకుందాం: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Mann Ki Baat: సెప్టెంబర్ నెల మనకు ఎంతో ముఖ్యమైన నెల అని, ఎందుకంటే ఈ నెలలో మనం వరల్డ్ రివర్ డే జరుపుకున్నామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. నదులు నిస్వార్థంగా మనకు

న్యూఢిల్లీ: సెప్టెంబర్ నెల మనకు ఎంతో ముఖ్యమైన నెల అని, ఎందుకంటే ఈ నెలలో మనం వరల్డ్ రివర్ డే జరుపుకున్నామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. నదులు నిస్వార్థంగా మనకు నీటిని సమకూరుస్తున్న అంశాన్ని గుర్తుచేసుకోవడం కోసం వరల్డ్ రివర్ డే జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ రోజు వరల్డ్ రివర్ డే జరుపుకుంటున్న నేపథ్యంలో దేశ ప్రజలందరినీ తాను ఒక్కటే కోరుతున్నానని, ఏడాదికి ఒక్కసారన్నా దేశంలో నది పండుగ (River festival) చేసుకుందామని ప్రధాని పేర్కొన్నారు.
మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఇప్పటివరకు తాను అందుకున్న బహుమతులను ప్రత్యేకంగా ఈ-వేలం వేసే ప్రక్రియ కొనసాగుతున్నదని, ఈ-వేలంలో వచ్చే మొత్తాన్ని తాను నమామీ గంగే క్యాంపెయిన్‌కు అంకితం చేస్తానని చెప్పారు. తమిళనాడులోని నాగా రివర్ ఒకప్పుడు పూర్తిగా ఎండిపోయిందని, అయితే అక్కడి గ్రామీణ మహిళల చొరవ, ప్రజల భాగస్వామ్యంతో ఆ నదికి మళ్లీ జీవం వచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ నదిలో పుష్కలంగా నీరు ఉందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

