Watch: చిన్నారిపై కుక్క దాడి.. రక్షించేందుకు ప్రయత్నించిన తల్లి
Dog Attacks 2 Year Child | ఒక చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసింది. (Dog Attacks 2 Year Child) తల్లి చేతిలో ఉన్న పాపను నోటితో పట్టి లాగేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కుక్క బారి నుంచి కుమార్తెను కాపాడుకునేందుకు ఆ మహిళ చాలా ప్రయత్నించింది. ఈ క్రమంలో చిన్నారితో సహా ఆమె రోడ్డుపై పడింది.
న్యూఢిల్లీ: ఒక చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసింది. (Dog Attacks 2 Year Child) తల్లి చేతిలో ఉన్న పాపను నోటితో పట్టి లాగేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కుక్క బారి నుంచి కుమార్తెను కాపాడుకునేందుకు ఆ మహిళ చాలా ప్రయత్నించింది. ఈ క్రమంలో చిన్నారితో సహా ఆమె రోడ్డుపై పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం విశ్వాస్ నగర్ ప్రాంతంలో ఒక మహిళ తన రెండేళ్ల కుమార్తెను ఒడిలో పట్టుకుని ఉంది. ఇంతలో ఒక పెంపుడు కుక్క వేగంగా వారి వద్దకు వచ్చింది. తల్లి ఒడిలో ఉన్న పాప కాళ్లను పట్టుకుని లాగేందుకు ప్రయత్నించింది. దీంతో కుక్క బారి నుంచి ఆ చిన్నారిని కాపాడుకునేందుకు ఆ తల్లి తెగ ప్రయత్నించింది. కుక్కతో పెనుగులాటలో పాపతో సహా రోడ్డుపై పడింది.
కాగా, ఆ వీధిలోని మరికొన్ని కుక్కలు కూడా ఆ మహిళ, పాపపై దాడి చేసేందుకు ముందుకు వచ్చాయి. ఆ సమయంలో అక్కడున్న కొందరు వ్యక్తులు వెంటనే స్పందించారు. కుక్కల బారి నుంచి పాపను, ఆమె తల్లిని కాపాడారు. ఒక వ్యక్తి చిన్నారిని చేతుల్లోకి తీసుకుని పక్కనే ఉన్న ఇంట్లోకి పరుగెత్తాడు. మిగతా వారు ఆ వీధిలోని పెంపుడు కుక్కలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనలో మహిళ, ఆమె కుమార్తె గాయపడ్డారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
पूर्वी दिल्ली के विश्वास नगर इलाके में कुत्ते ने एक दो-वर्षीय बच्चे को काट लिया घटना उस समय हुई जब एक महिला अपने कुत्ते के साथ गली में टहल रही थी, और अचानक कुत्ता उस छोटे बच्चे पर हमला कर बैठा #dog pic.twitter.com/LrA0DGdls5
— Lavely Bakshi (@lavelybakshi) January 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

