18 ఏళ్లు దాటిన వారికి టీకా ఇవ్వండి.. ప్రధానిని కోరిన ఐఎంఏ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఉదృతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇవాళ ప్రధాని మోదీకి ఓ లేఖ రాసింది. కోవిడ్19 వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, 18 ఏళ్ల వయసు దాటిన వారికి కూడా కోవిడ్ టీకా ఇచ్చే విధంగా అనుమతి ఇవ్వాలని ఐఎంఏ ఇవాళ తన లేఖలో కోరింది. వాక్ ఇన్ కోవిడ్ టీకాలు అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకాలు ఇవ్వాలని ఐఎంఏ తన లేఖలో పేర్కొన్నది. దేశంలో సెకండ్ వేవ్ ఉదృతంగా ఉందని, అందుకే యుద్ధ ప్రాతిపదికను టీకాలు ఇవ్వాలని కోరింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగవంతం చేసేందుకు తమ యంత్రాంగం మొత్తం నిర్విరామంగా కృషి చేస్తుందని, అందుకే 18 ఏళ్లు దాటిన వారికి టీకా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ఐఎంఏ సూచన చేసింది. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లాలంటే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను తప్పనిసరి చేయాలని కోరారు. వైరస్ కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో నిత్యావసరం కానటువంటి సినిమాలు, సాంస్కృతి, మతపరమైన కార్యక్రమాలు, క్రీడలను రద్దు చేయాలని ఐఎంఏ తన లేఖలో తెలిపింది.
Press Release 06.04.2021 pic.twitter.com/oeLDaiIYIO
— Indian Medical Association (@IMAIndiaOrg) April 6, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

