Parents Forget Child In Car | కుమార్తెను కారులో వదిలేసి పెళ్లికెళ్లిన పేరెంట్స్.. ఊపిరాడక చిన్నారి మృతి
Parents Forget Child In Car | తల్లిదండ్రులు తమ కూతుర్ని కారులో వదిలేసి పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అతిథులతో మాట్లాడటంలో బిజీ అయ్యారు. ఆ తర్వాత రెండో కుమార్తె కనిపించడం లేదని గుర్తించారు. అంతా వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు కారులో చూడగా ఆ చిన్నారి ఊపిరాడక చనిపోయింది.
జైపూర్: తల్లిదండ్రులు తమ కూతుర్ని కారులో వదిలేసి పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అతిథులతో మాట్లాడటంలో బిజీ అయ్యారు. ఆ తర్వాత రెండో కుమార్తె కనిపించడం లేదని గుర్తించారు. అంతా వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు కారులో చూడగా ఆ చిన్నారి ఊపిరాడక చనిపోయింది. (Parents Forget Child In Car) రాజస్థాన్‌లోని కోటాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం సాయంత్రం ప్రదీప్ అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి పెళ్లి వేడుకకు కారులో వెళ్లాడు. అక్కడకు చేరుకున్న తర్వాత భార్య, పెద్ద కూతురు కారు నుంచి దిగారు.
కాగా, ఇద్దరు కుమార్తెలు కారు దిగి తల్లితో కలిసి ఫంక్షన్ హాల్లోకి వెళ్లి ఉంటారని భావించిన ప్రదీప్ కారును ఒక చోట పార్క్ చేసి డోర్ లాక్ చేశాడు. తర్వాత అతడు కూడా లోపలకు వెళ్లాడు. వారిద్దరూ విడివిడిగా సుమారు రెండు గంటలపాటు పెళ్లికి హాజరైన వారిని కలిసి ముచ్చటించారు.
మరోవైపు చివరకు కలుసుకున్న భార్యాభర్తలు మూడేళ్ల చిన్న కుమార్తె గోర్విక కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. ఆ చిన్నారి గురించి అక్కడ వెతికారు. మూడు గంటల తర్వాత పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లారు. డోర్ తెరిచి చూడగా వెనుక సీటులో అచేతనంగా పడి ఉన్న గోర్వికను చూశారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఊపిరాడక ఆ చిన్నారి అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
అయితే కుమార్తె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు పేరెంట్స్ నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ సంఘటనపై ఫిర్యాదు కూడా చేయలేదని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- car
- Child Dead
- Daughter
- forget
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

