PAPA payload | సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తున్న ఆదిత్య-ఎల్1 ఉపగ్రహంలోని ‘పాపా’ పేలోడ్
PAPA payload | ఆదిత్య-ఎల్1 ఉపగ్రహంలోని ‘ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ ఫర్ ఆదిత్య (పాపా)’ పేలోడ్ విజయవంతంగా పనిచేస్తున్నదని ఇస్రో తెలిపింది. దీని అధునాతన సెన్సార్లు ఈ ఏడాది ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సంభవించిన పరిణామాలతోపాటు కరోనల్ మాస్ ఎజెక్షన్ల (CMEs) ప్రభావాన్ని గుర్తించినట్లు ఇస్రో ట్విట్టర్లో వెల్లడించింది.
PAPA payload: ఆదిత్య-ఎల్1 ఉపగ్రహంలోని ‘ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ ఫర్ ఆదిత్య (పాపా)’ పేలోడ్ విజయవంతంగా పనిచేస్తున్నదని ఇస్రో తెలిపింది. దీని అధునాతన సెన్సార్లు ఈ ఏడాది ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సంభవించిన పరిణామాలతోపాటు కరోనల్ మాస్ ఎజెక్షన్ల (CMEs) ప్రభావాన్ని గుర్తించినట్లు ఇస్రో ట్విట్టర్లో వెల్లడించింది.
పాపాలో రెండు సెన్సార్లు ఏర్పాటుచేశారు. అందులో ఎలక్ట్రాన్లను కొలవడానికి ‘సోలార్ విండ్ ఎలక్ట్రాన్ ఎనర్జీ ప్రోబ్ (SWEEP)’, అయాన్లను కొలవడానికి ‘సోలార్ విండ్ అయాన్ కంపోజిషన్ ఎనలైజర్ (SWICAR)’ ఉన్నాయి. రెండు సెన్సార్లు సౌర పవన కణాలు ఏ దిశ నుంచి వస్తున్నాయో గుర్తించగలుగుతాయి.
ఈ సెన్సార్లు డిసెంబర్ 12 నుంచి పనిలో ఉన్నట్లు ఇస్రో తెలిపింది. ఊహించిన విధంగా ప్రోటాన్లు, ఆల్ఫా కణాల కదలికను గుర్తించేలా ఒక స్పెక్ట్రాను రికార్డ్ చేసింది. జనవరి 6న ఆదిత్య-ఎల్1 హాలో ఆర్బిట్ ఇన్సర్షన్ సమయంలో తాత్కాలికంగా పేలోడ్ ఓరియంటేషన్ మారినప్పుడు స్పెక్ట్రాలో కొంత డిప్ కనిపించినట్లు వెల్లడించింది.
DSCOVR, ACE శాటిలైట్స్ ద్వారా డిసెంబర్ 15న వచ్చిన డేటాను ఇస్రో విశ్లేషించింది. ఆదిత్య ఎల్1లోని CME సెన్సార్లు L1 పాయింట్ వద్ద సౌరగాలి మార్పులకు అనుగుణంగా కణాల స్థానాల్లో మార్పులు గమనించినట్లు చెప్పింది. ఫిబ్రవరి 10, 11న కూడా సౌరగాలిలో స్వల్ప వ్యత్యాసాలు ఏర్పడినట్లు గుర్తించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

