Pan Masala: పాన్‌మసాలా ఓనర్ కోడలి సూసైడ్.. భర్త, అత్తపై కేసు నమోదు
Pan Masala: పాన్‌మసాలా ఓనర్ కమల్ కిషోర్ కోడలు దీప్తి చౌరాసియా సూసైడ్ చేసుకున్నది. ఆ ఘటనలో పాన్‌మసాలా ఓనర్ భార్య, కొడుకుపై ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 108, 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
న్యూఢిల్లీ: పాన్‌మసాలా(Pan masala) వ్యాపారి కమల్ కిషోర్‌కు చెందిన 38 ఏళ్ల కోడలు దీప్తి చౌరాసియా కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సూసైడ్ ఘటనతో లింకున్న కేసులో.. దీపి భర్త, ఆమె అత్తపై కేసు బుక్ చేశారు. కమ్లాపసంద్, రాజశ్రీ బ్రాండ్లకు పాన్‌మసాలా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని వసంత్ విహార్ ఇంట్లో గత వారం దీప్తి ఆత్మహత్య చేసుకున్నది. అయితే శుక్రవారం దీప్తి భర్త, అత్తపై కేసు నమోదు చేశారు. వేధింపుల వల్ల తన కూతురు సూసైడ్ చేసుకున్నట్లు దీప్తి తల్లి ఫిర్యాదు చేసింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 108, 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
దీప్తి ఇంట్లో సీలింగ్‌కు ఉరి వేసుకున్నది. దీన్ని ఆమె భర్త గుర్తించాడు. ఆ ఘటన గురించి ఫ్యామిలీ సభ్యులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీప్తి రూమ్ నుంచి ఓ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భర్తతో వివాదం ఉన్నట్లు దాంట్లో రాసింది. ఓ సూసైడ్ నోట్‌ను కూడా స్వాదీనం చేసుకున్నారు. ప్రేమ లేదు, నమ్మకం లేదని ఆ నోట్లో రాసి ఉన్నది. రిలేషన్లో ప్రేమ, నమ్మకం లేనప్పుడు, జీవితానికి అర్థం ఏముందని రాసుకుందామె.
2010లో ఆ జంట పెళ్లి చేసుకున్నది. వారికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. దీప్తి భర్తకు మరో మహిళతో సంబంధం ఉందని, దాని వల్లే దీపిపై భౌతిక దాడి చేశారని ఆమె పేరెంట్స్ ఆరోపించారు. దక్షిణాది సినిమా నటి తనీషా సింగ్‌తో తన బావకు అఫైర్ ఉన్నట్లు దీప్తి సోదరుడు రిషబ్ ఆరోపించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

