చుట్టూ గూఢచారులే!.. జాబితాలో యూట్యూబర్, జవాన్లు మొదలుకొని ఉద్యోగులు, విద్యార్థులు
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి పాకిస్థాన్ గూఢచర్యం ఆనవాళ్లు దేశంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాక్ ఐఎస్ఐకి గూఢచర్యం చేస్తూ.. భారత్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో నెల రోజుల వ్యవధిలో కనీసం 15 మందిని భారత నిఘా వర్గాలు అదుపులోకి తీసుకొన్నాయి.
- నెల లోనే 15 మంది అరెస్టు
- ఒక్కొక్కరుగా పట్టుబడుతున్న వైనం
- పాక్ ఐఎస్ఐకి ఇక్కడి నుంచే లీకులు!
- ముందుగా గుర్తించని కేంద్ర ప్రభుత్వం
భద్రతా లోపాలు నిజమే: అమిత్ షా
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో భద్రతాపరమైన లోపాలు జరిగిన మాట వాస్తవమేనని కేంద్రహోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ చివరి వారంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అంగీకరించారు. ‘తప్పు జరగకపోయి ఉంటే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటాము? ఎక్కడో కొన్ని లోపాలు జరిగాయి. అవి ఏమిటో మనం కనిపెట్టాల్సి ఉన్నది’ అని సమావేశంలో అమిత్‌షా వ్యాఖ్యానించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి పాకిస్థాన్ గూఢచర్యం ఆనవాళ్లు దేశంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాక్ ఐఎస్ఐకి గూఢచర్యం చేస్తూ.. భారత్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో నెల రోజుల వ్యవధిలో కనీసం 15 మందిని భారత నిఘా వర్గాలు అదుపులోకి తీసుకొన్నాయి.
నిందితులు రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజా బ్ తదితర రాష్ర్టాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. యూట్యూబర్, సీఆర్పీఎఫ్ జవాన్, ప్రభుత్వాధికారి, మెకానికల్ ఇంజినీర్, స్టూడెంట్, మసీదు ఇమామ్, సెక్యూరిటీ గార్డు, వ్యాపారి, టెకీ, హెల్త్ వర్కర్, సిమ్ కార్డులు విక్రయించే వ్యక్తి ఇలా పలు రంగాలకు చెందిన వ్యక్తులు పాక్‌కు గూఢచారులుగా వ్యవహరించినట్టు అధికారులు పేర్కొన్నారు.
డబ్బులకు ఆశపడి కొందరు, హనీట్రాప్‌లో పడి మరికొందరు.. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేసినట్టు వారు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ముందు నుంచే ఈ గూఢచర్యం కొనసాగుతున్నదని, దాన్ని గుర్తించడంలో కేంద్రం వైఫ ల్యం చెందిందని నిపుణులు విమర్శిస్తున్నారు. భద్రతాపరమైన లోపాలు చోటుచేసుకొన్న మాట వాస్తవమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ఒప్పుకున్నారు.
అరెస్టయిన గూఢచారులు వీళ్లే
- జ్యోతిమల్హోత్రా (యూట్యూబర్): పాక్‌లో ఇంటెలిజెన్స్ అధికారులను కలిశారు. ఉగ్రదాడికి ముందు పహల్గాంలోనూ పర్యటించారు. ఉగ్రదాడి తర్వాత పాక్ హైకమిషన్ వద్ద కేక్ డెలివరీ చేసిన వ్యక్తితోనూ ముచ్చట్లు పెట్టారు. 12 టెరాబైట్ల డేటా పాక్‌కు చేర్చినట్టు అనుమానిస్తున్నారు.
- మోతీరామ్ జాట్ (సీఆర్పీఎఫ్ జవాన్): డబ్బులు తీసుకొని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ (పీఐవో)కు 2023 నుంచే కీలక సమాచారాన్ని చేరవేస్తున్నాడు.
- రవీంద్ర వర్మ (మెకానికల్ ఇంజినీర్): ముంబైలోని ఓ రక్షణ రంగ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. 2024 నుంచి భారత్‌కు చెందిన యుద్ధనౌకలు, సబ్మెరైన్ల సమాచారాన్ని స్కెచ్‌ల రూపంలో పాక్‌కు చేరవేశాడు.
- సహదేవ్‌సింగ్ (హెల్త్ వర్కర్): ఐఏఎఫ్, బీఎస్ఎఫ్ ఇన్ఫ్రాకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్‌కు చేరవేశాడు. 2023 నుంచే ఈ కార్యకలాపాలు సాగుతున్నాయి.
- దేవేందర్ సింగ్ (పీజీ స్టూడెంట్): 2024 నవంబర్‌లో పాక్‌లో పర్యటించాడు. అప్పుడే భారత సైన్యానికి సంబంధించిన కొన్ని ఫొటోలను పాక్‌కు చేరవేశాడు.
- నౌమన్ (సెక్యూరిటీ గార్డు): హర్యానా సరిహద్దుల్లోని భద్రతాదళాలకు సంబంధించిన సమాచారాన్ని పాక్‌కు చేరవేశాడు. ఐఎస్ఐకి మన సైన్యం కదలికలను ఎప్పటికప్పుడు తెలియచేశాడు. ఆర్మన్, తారిఫ్ అనే మరో ఇద్దరు కూడా ఇదే కేసులో అరెస్టయ్యారు.
- షాకూర్ ఖాన్ (ప్రభుత్వాధికారి): ఏడుసార్లు అనధికారికంగా పాక్‌లో పర్యటించాడు. మెయిల్, వాట్సాప్‌లో కొన్ని ఫైల్స్‌ను డిలీట్ చేశాడు. పాక్ నుంచి కొంత మొత్తంలో డబ్బులు ఈయన ఖాతాకు బదిలీ అయ్యాయి.
- కాసీమ్ (సిమ్‌కార్డుల విక్రయదారి): ఇండియన్ మొబైల్ సిమ్‌కార్డులను పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ (పీఐవో)కు విక్రయించాడు. ఐఎస్ఐకి కీలక సమాచారమిచ్చాడు.
- షాహ్జాద్ (బిజినెస్‌మ్యాన్): పాక్‌లో పలుమార్లు పర్యటించాడు. అక్రమంగా సరుకును రవాణా చేశాడు. సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేశాడు.
- ముర్తాజా అలీ (టెకీ): మన దళాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐకి పంపించడానికి ఏకంగా ప్రత్యేకమైన యాప్‌ను తయారు చేశాడు. వీళ్లేకాకుండా యూపీలోని ఓ మసీదు ఇమామ్‌ను, పంజాబ్‌కు చెందిన గజాలా, యామిన్ను కూడా గూఢచర్యం కేసులో పోలీసులు అరెస్టు చేశారు.
గూఢచారి ఇంజినీర్ అరెస్ట్
ముంబై: రక్షణ సాంకేతిక సంస్థలో జూనియర్ ఇంజినీరుగా పని చేస్తున్న రవీంద్ర వర్మ (27)ను మహారాష్ట్ర పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆయన పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు కేసు నమోదు చేశారు. కోర్టు ఆయనను యాంటీ టెర్రరిజం స్కాడ్ కస్టడీకి అప్పగించింది. పోలీసుల కథనం ప్రకారం, థానేలోని కల్యాణికి చెందిన రవీంద్ర వర్మకు 2024లో ఫేస్బుక్ ద్వారా పాకిస్థాన్ ఏజెంట్లు పాయల్ శర్మ, ఇస్ప్రీత్లతో పరిచయమైంది. వారిద్దరూ తాము భారత్‌కు చెందినవారమని పరిచయం చేసుకున్నారు. ఓ ప్రాజెక్టు కోసం యుద్ధ నౌకల సమాచారం కావాలని వర్మను కోరారు. వర్మ వారి వలపు వలలో చిక్కుకున్నాడు. దక్షిణ ముంబైలోని నావల్ డాక్ యార్డుకు వెళ్లేందుకు, నౌకాదళ యుద్ధ నౌకలు, జలాంతర్గాముల్లో ప్రయాణించేందుకు ఆయనకు అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసి, యుద్ధ నౌకలతోపాటు జలాంతర్గాములకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆ పాక్ ఏజెంట్లకు చేరవేశాడు. అందుకు బదులుగా వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు పొందాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

