సరిహద్దు సమీపంలో.. రెండు పాక్ ఎయిర్‌బేస్‌లు

న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో రెండు ఎయిర్‌బేస్‌లను పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (పీఏఎఫ్) పునరుద్ధరించింది. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) సమీపంలోని ఉన్న ఈ రెండు ఎయిర్‌బేస్‌లు శ్రీనగర్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పాక్ ఆక్రమిక కశ్మీర్(పీవోకే)లోని కోట్లి, రావల్కోట్లో ఉన్న ఈ ఎయిర్‌బేస్‌లను కొన్నేండ్ల కిందట మూసివేశారు. కాగా, 2019 ఫిబ్రవరి 26న పీవోకేలోని బాలకోట్లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) మెరుపు దాడి చేసింది. అనంతర పరిణామాల నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో చాలా కాలంగా వినియోగంలో లేని రెండు ఎయిర్‌బేస్‌లను పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ తిరిగి తెరిచినట్లు సమాచారం.
పాకిస్థాన్ ఆర్మీ 23 డివిజన్లో భాగమైన 3 POK బ్రిగేడ్ ప్రాంతంలో కోట్లీ ఎయిర్ బేస్ ఉన్నది. ఇటీవల వందకు పైగా వాయు రక్షణ దళాలను ఇక్కడకు తరలించారు. మరోవైపు రావల్కోట్ ఎయిర్ బేస్, పాక్ ఆర్మీ 12 డివిజన్‌కు చెందిన 2 POK బ్రిగేడ్ కిందకు వస్తుంది. నాలుగేళ్ల కిందట మూసివేసిన ఈ ఎయిర్ బేస్‌ను పీఏఎఫ్ తిరిగి తెరిచింది. ఎఫ్-16 యుద్ధ విమానాలను స్వల్ప సంఖ్యలో మోహరించింది.
మరోవైపు బలూచిస్థాన్‌లోని షమ్సీ ఎయిర్ బేస్‌ను పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (పీఏఎఫ్) బలోపేతం చేస్తున్నది. సింధులోని జాకబాబాద్ పీఏఎఫ్ స్థావరం సమీపంలో కొత్త సైనిక కంటోన్మెంట్ని నిర్మిస్తున్నారు. కాగా, ఈ చర్యలు ఈ ప్రాంతంలో అశాంతిని రాజేయడంతోపాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచవచ్చని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ సర్కార్ గుండెలదిరేలా గర్జించిన రైతన్న
KTR | రాబందు రాజ్యంలో అన్నీ బంద్.. కాంగ్రెస్ సర్కార్‌పై గర్జించిన రామన్న
Cyclone Murasu | ముంచుకొస్తున్న ‘మురసు’.. నేడు తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం
Raptadu Incident | రాప్తాడు బాలికపై దాడి చేసిన ఉన్మాది హేమంత్పై పోలీసుల కాల్పులు.. 6 రౌండ్లు ఫైర్
Horoscope | 02-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

