Watch: బాలుడిపై వీధి కుక్కలు దాడి.. కాపాడిన ఒక వ్యక్తి
Stray Dogs Attack Child | చిన్న పిల్లలపై వీధి కుక్కల దాడి సంఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఐదు కుక్కలు ఆడుకుంటున్న పసి బాలుడిపై దాడి చేశాయి. కింద పడిన ఆ చిన్నారిని నోటితో పట్టుకుని ఈడ్చాయి. సమీపంలో ఉన్న ఒక వ్యక్తి గమనించి వెంటనే స్పందించాడు.
లక్నో: చిన్న పిల్లలపై వీధి కుక్కల దాడి సంఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఐదు కుక్కలు ఆడుకుంటున్న పసి బాలుడిపై దాడి చేశాయి. (Stray Dogs Attack Child) కింద పడిన ఆ చిన్నారిని నోటితో పట్టుకుని ఈడ్చాయి. సమీపంలో ఉన్న ఒక వ్యక్తి గమనించి వెంటనే స్పందించాడు. కుక్కల బారి నుంచి ఆ బాలుడ్ని కాపాడాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. సోమవారం రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని కేడీపీ సొసైటీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ గార్డెన్లో రెండున్నర ఏళ్ల బాలుడు ఆడుకుంటున్నాడు. ఇంతలో ఐదు కుక్కల గుంపు ఆ చిన్నారిపై దాడి చేశాయి. కిందపడిన బాలుడ్ని నోటితో ఈడ్చాయి.
కాగా, ఆ సమయంలో సమీపంలో ఉన్న వ్యక్తి బాలుడిపై కుక్కల దాడిని చూశాడు. పరుగున ఆ చిన్నారి వద్దకు వచ్చాడు. బాలుడ్ని చేతులతో పైకి ఎత్తుకుని కుక్కల బారి నుంచి కాపాడాడు. గాయాలైన ఆ చిన్నారికి చికిత్స అందించారు.
మరోవైపు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో వీధి కుక్కల దాడుల నుంచి పిల్లలను కాపాడాలని, వాటిని అరికట్టాలని అధికారులకు వినతులు వెల్లువెత్తాయి.
सोसाइटी में आवारा कुत्ते लोगो के लिए आफत बन गए है, #Cctv राजनगर एक्सटेंशन के KDP सोसाइटी की है, ढाई साल के मासूम पर कुत्तों का झुंड टूट पड़ा, समय रहते शख्स ने उसे बचा लिया, जो कहे कुत्ते बेवजह हमला नही करते वो इसे जरूर देखें। @Uppolice @AMRUTCityGzb @VikramadityaSM @OfGzb pic.twitter.com/QmKssJBIJv
— Lokesh Rai (@lokeshRlive) January 29, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

