Women Candidates | 2019లో 78 మంది.. ఈసారి 30కు పైగా గెలిచిన మహిళా అభ్యర్థులు
Women Candidates | 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళలు పోటీ చేశారు. అయితే 2019లో 79 మంది మహిళా అభ్యర్థులు విజయం సాధించగా ఈసారి కేవలం 30 మందికిపైగా మాత్రమే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో గతంలో కంటే ఈసారి తక్కువ మంది మహిళా అభ్యర్థులు (Women Candidates) గెలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళలు పోటీ చేశారు. అయితే 2019లో 79 మంది మహిళా అభ్యర్థులు విజయం సాధించగా ఈసారి కేవలం 30 మందికిపైగా మాత్రమే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం బీజేపీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన కంగనా రనౌత్, కాంగ్రెస్ నాయకుడు విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్లతో గెలుపొందారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని మధుర నుంచి సీనియర్ నటి, ప్రస్తుత బీజేపీ ఎంపీ హేమా మాలిని 5.1 లక్షల ఓట్లతో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ భార్య, మెయిన్‌పురి ప్రస్తుత ఎంపీ డింపుల్ యాదవ్ తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన జయవీర్ సింగ్‌పై 2,21,639 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సమాజ్‌వాదీ పార్టీ మచ్లిషహర్కు చెందిన 25 ఏళ్ల అభ్యర్థి ప్రియా సరోజ్, కైరానా స్థానానికి చెందిన 29 ఏళ్ల ఇక్రా చౌదరి విజయం సాధించిన మహిళలల్లో అతి పిన్న వయస్కులు.
మరోవైపు బీహార్‌లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిషా భారతి పాటలీపుత్ర నుంచి ప్రస్తుత ఎంపీ, కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్‌పై 85,174 ఓట్ల తేడాతో గెలుపొందారు. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి మహువా మోయిత్రా 56,705 ఓట్లతో గెలుపొందారు. డీఎంకే అభ్యర్థి కనిమొళి కరుణానిధి 5,40,729 ఓట్లు సాధించి తూత్తుక్కుడి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. హర్యానాలోని సిర్సా లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌కు చెందిన కుమారి సెల్జా 2.5 లక్షల ఓట్లతో గెలుపొందగా, బీజేపీ అగ్ర నాయకురాలైన దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ఢిల్లీ నియోజకవర్గంలో 78,370 ఓట్లతో విజయం సాధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

