పంజాబ్‌లో ఓడిన ఆపరేషన్ లోటస్
Punjab CM: పంజాబ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ బీజేపీపై విమర్శలు గుప్పించారు.
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు ఇతర రాష్ట్రాల్లో లాగే పంజాబ్‌లో కూడా ఆపరేషన్ లోటస్ అమలు చేయబోయారని, కానీ ఇక్కడ ఆ ఆపరేషన్ లోటస్ ఓటమిపాలైందని అన్నారు. పంజాబ్‌లో ఆప్ సర్కారు ఏర్పాటై ఆరు నెలలైనా కాకముందే.. బీజేపీ దాన్ని కూల్చేందుకు ప్రయత్నించి విఫలమైందని ఆరోపించారు.
ఇటీవల ఆప్ సర్కారును కూల్చేందుకు ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25 కోట్ల చొప్పున ఆఫర్ చేసిన బీజేపీ ఆపరేషన్ లోటస్‌కు తెరతీసింది. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టడంతో వారి ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ క్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. విశ్వాస పరీక్ష కోసం గవర్నర్ అనుమతితో అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించారు.
ఈ ఉదయం సెషన్ ప్రారంభం కాగానే సీఎం భగవంత్ మాన్ సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే సభలో చర్చించాల్సిన అంశాలను పక్కనపెట్టి సీఎం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. అయినా 91 మంది ఆప్ ఎమ్మెల్యేలు, ఒక శిరోమణి ఎమ్మెల్యే, ఒక బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో విశ్వాస తీర్మానం నెగ్గింది. అనంతరం సీఎం మాన్ మీడియాతో మాట్లాడారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

