ఆ సీఎంకు ఉన్న ఆస్తులెంతో తెలుసా..?!

తిరువనంతపురం: సంపూర్ణ అక్షరాస్యతకు పెట్టింది పేరు ఆ రాష్ట్రం.. అలాగే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పేరొందింది కూడా.. ఆ రాష్ట్రాన్ని దేవభూమి అని కూడా పిలుస్తారు.. అదే కేరళ.. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. సీపీఎం సారధ్యంలోని ఎల్డీఎఫ్ కూటమి అధికారంలో ఉంది.. సీఎంగా సీపీఎం నేత పినరాయి విజయన్ కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన తన సొంత జిల్లా కన్నూరులోని ధర్మాడం నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలతోపాటు విజయన్ సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు తెలిపారు. అయితే, ఆశ్చర్యకరమైన సంగతేంటంటే.. ఆయన ఆస్తుల విలువ రూ. కోటి లోపే..
పినరాయి విజయన్ ఆస్తులన్నీ రూ.54 లక్షలే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఆయన వార్షిక ఆదాయం రూ.2.87 లక్షలు. తనకు రెండు సొంత ఇండ్లు ఉన్నాయని పేర్కొన్న విజయన్ సొంత వాహనమే లేదని ప్రకటించారు. తన పేరిట రూ.51.95 లక్షల విలువైన స్థిరాస్తులు, 2.04 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని తెలిపారు.
అయితే తన భార్య పేరిట రూ.35 లక్షల విలువైన స్థిరాస్తులు, రూ.29.7లక్షల చరాస్తులు ఉన్నాయన్నారు. ఆమె ఉపాధ్యాయురాలిగా రిటైరయ్యారని అఫిడవిట్లో పినరయి స్పష్టంగా పేర్కొన్నారు. అయితే వీరిద్దరికీ అప్పులు కూడా ఏమీ లేకపోవడం మరో విశేషం. భార్య పేరిట రూ.3.3 లక్షలు విలువ గల 80 గ్రాముల బంగారం ఉంది.
తనపై రెండు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని అఫిడవిట్లో పినరాయి విజయన్ వెల్లడించారు. 2016 నుంచి కేరళ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో వచ్చేనెల ఆరవ తేదీన పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 2వ తేదీన విడుదల అవుతాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- assets
- Kerala
- Pinarai Vijayan
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagga Reddy | సోనియాగాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా : జగ్గారెడ్డి
Kiara Advani | ‘టాక్సిక్’ రిజల్ట్ నన్ను కుంగదీసింది : కియారా అద్వానీ
Pat Cummins: క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్‌తో సిడ్నీ వీధిలోనే గొడవపడ్డ భార్య.. వీడియో
Shekhar Master | కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టిన వ్యాన్
భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు తప్పనిసరి : ఎంపీడీవో పుల్లారావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

