ముంబై: ఒక వ్యక్తి చికిత్సకు సంబంధించిన బిల్లుపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో శివసేన నేతలు రెచ్చిపోయారు. ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Hospital Staff Assaulted By Shiv Sena Workers) మహారాష్ట్రలోని పాల్గఢ్లో ఈ సంఘటన జరిగింది. జన్మాష్టమి సందర్భంగా ‘దహి హండి’లో పాల్గొన్న కృష్ణ భక్త బృందానికి చెందిన ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు అతడ్ని తరలించి చికిత్స అందించారు.
కాగా, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో రూ.19,866 బిల్లు ఇవ్వడంతో ఆ వ్యక్తికి చెందిన బృంద సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడ గందరగోళం చెలరేగింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన జిల్లా అధ్యక్షుడు కుందన్ సంఖే, నగర అధ్యక్షుడు రాహుల్ ఘరత్, ఆ పార్టీ కార్యకర్తలు ఐసీయూలోకి ప్రవేశించారు. అక్కడున్న వైద్యులు, నర్సులతో వాగ్వాదానికి దిగారు. వారిని బెదిరించారు.
అయితే ఈ గొడవను ఆపడానికి ప్రయత్నించిన ఒక రిసెప్షనిస్ట్ చెంపపై శివసేన నేత కొట్టారు. ఒక మహిళా ఉద్యోగిని ఆయన బెదిరించారు. గాయపడిన వ్యక్తికి అమర్చిన ఐవీ డ్రిప్‌ను తొలగించారు. అతడిని ఆసుపత్రి నుంచి తీసుకువెళ్లినట్లు సిబ్బంది ఆరోపించారు.
మరోవైపు శివసేన జిల్లా అధ్యక్షుడు కుందన్, నగర అధ్యక్షుడు రాహుల్, స్థానిక ఎమ్మెల్యే రాజేంద్ర గావిత్ కుమారుడు రోహిత్ గావిత్తో సహా 17 మందిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో శివసేన నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
पालघर के एक निजी अस्पताल में घायल गोविंदा के इलाज और CT स्कैन के खर्च को लेकर विवाद हो गया। अस्पताल की शिकायत के अनुसार, शिवसेना जिला प्रमुख कुंदन संखे समेत 17 लोगों पर डॉक्टरों और कर्मचारियों से बदसलूकी व मारपीट के आरोप हैं। पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है। वहीं, कुंदन… pic.twitter.com/sbKasKsKxj
— मारवाड़ी न्यूज़ (@MarwadiNews_) September 6, 2026