న్యూఢిల్లీ : మెట్రో రైళ్లలో ప్రయాణీకుల డ్యాన్స్ పెర్ఫామెన్స్, సీటు కోసం సిగపట్ల వంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. లేటెస్ట్గా న్యూయార్క్ ట్రైన్లో ఓ వ్యక్తి ప్రయాణీకుల ఎదుటే స్నానం చేసిన వీడియో (viral video) నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వీడియోలోని వ్యక్తిని కంటెంట్ క్రియేటర్ ప్రిన్స్ జీగా గుర్తించారు.
ఈ క్లిప్‌ను ప్రిన్స్ జీ తన ఫేస్బుక్ ఖాతాలో గత ఏడాది నవంబర్‌లో షేర్ చేయగా ప్రస్తుతం ఈ పాత వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ప్రిన్స్ జీ తనకు ఎదురుగా సూట్‌కేసును ఓపెన్ చేసి బట్టలు విప్పడం ప్రారంభిస్తాడు. ఆపై సూట్‌కేసులో నిలబడి స్క్రబ్కింగ్ చేస్తూ స్నానం చేయడం కనిపిస్తుంది.
స్నానం పూర్తి చేసిన తర్వాత శరీరాన్ని శుభ్రంగా తుడుచుకుని బట్టలు వేసుకున్న అనంతరం ట్రైన్ నుంచి వెనుతిరుగుతాడు. న్యూయార్క్ ట్రైన్లో స్నానం చేశానని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ట్రైన్లో స్నానం చేస్తున్న ఈ వీడియో వినోదభరితంగా ఉందని, అందరి ముఖాల్లో నవ్వులు పూయించిందని పలువురు యూజర్లు వ్యాఖ్యానించగా, ఇది ఇబ్బందికర క్లిప్ అని మరికొందరు యూజర్లు రాసుకొచ్చారు.
Read More