Hardeep Puri | పెట్రో ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి కాబట్టి.. రష్యా- ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో దేశంలో పెట్రో ధరలు పెరుగుతాయని పెద్ద ప్రచారం సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటి నుంచే పెట్రో ట్యాంకులను నింపేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పెట్రో ధరలు పెరుగుతాయా? అన్న దానిపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టత నిచ్చారు. దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే… పెట్రో ధరల పెంపు విషయంలో ఓ నిర్ణయానికి వస్తామని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మాట్లాడారు.
‘చమురు ధరలు ప్రపంచ ధరల బట్టి నిర్ణయం అవుతాయి. ప్రపంచంలో ఓ ప్రాంతంలో యుద్ధ వాతావరణం అలుముకుంది. పెట్రో ధరల పెంపు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే వుంటుంది’ అని హర్దీప్ సింగ్ పూరీ ప్రకటించారు. ఐదు రాష్ట్రాల ఎన్నిల కారణంగానే పెట్రో ధరలు పెంచడం లేదన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పారు. అయితే ఇంధన అవసరాలను తీర్చేలా చూసే బాధ్యత మాత్రం తమదేనన్నారు. అతి త్వరలోనే పెట్రో కంపెనీలు దీనిపై నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ హర్దీప్ సింగ్ పూరీ
కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పేరెత్తకుండా ఆయనపై విరుచుకుపడ్డారు. ‘ఎన్నికలు ముగిశాయి.. అందరూ పెట్రో ట్యాంకులు నింపుకోండి అంటూ ఓ యువ ఎంపీ పదే పదే పిలుపునిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలోనైతే పెట్రో ధరలపై నియంత్రణనే ఎత్తిపారేశారు. తాము మాత్రం గత సంవత్సరం నవంబర్‌లో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని కూడా తగ్గించాం.’ అని హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

