Watch: బ్యాటింగ్ చేశాడు కానీ.. బొక్కబోర్లా పడ్డాడు..!! ఎమ్మెల్యే క్రికెట్ వీడియో వైరల్
Odisha MLA Bhupendra Singh | ఒక ఎమ్మెల్యే క్రికెట్ మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తనలోని క్రీడాకారుడ్ని అందరికీ చూపాలనుకున్నారు. బ్యాటింగ్ చేయబోయి అదుపుతప్పి బోర్లాపడ్డారు. గాయపడిన ఆయన ఆసుపత్రిపాలయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భువనేశ్వర్: ఒక ఎమ్మెల్యే క్రికెట్ మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తనలోని క్రీడాకారుడ్ని అందరికీ చూపాలనుకున్నారు. బ్యాటింగ్ చేయబోయి అదుపుతప్పి బొక్క బోర్లాపడ్డారు. గాయపడిన ఆయన ఆసుపత్రిపాలయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒడిశాలోని కలహండి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నార్ల నియోజకవర్గం ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ (Odisha MLA Bhupendra Singh) ఇటీవల కలహండిలో క్రికెట్ మ్యాచ్‌ను ప్రారంభించారు. యువకుల హుషారు, క్రికెట్ పిచ్ చూడగానే బ్యాట్ పట్టుకోకుండా ఉండలేకపోయారు. ఒక యువకుడు బాల్ వేయగా బ్యాట్‌తో బిగ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ అదుపుతప్పి నేలపై బోర్లాపడ్డారు. దీంతో తల, ముఖం, చేతులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో చికిత్స కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. రాజకీయ నాయకులు రాజకీయాలకు పరిమితమైతే మంచిదని కొందరు సూచించారు. క్రీడల్లో కూడా రాజకీయం చేయాలని చూస్తే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని మరికొందరు వ్యాఖ్యానించారు.
क्रिकेट खेलते गिरे विधायक, हुए जख्मी!
ओडिशा के नारला के बीजेडी विधायक भूपेन्द्र सिंह कालाहांडी में एक खेल प्रतियोगिता का उद्घाटन करने गए, तभी बल्लेबाजी में हाथ आजमाने लगे, शॉट मारने की कोशिश में पिच पर जा गिरे और बुरी तरह चोटिल हो गए. अस्पताल में इलाज जारी है, वीडियो वायरल हो… pic.twitter.com/qEhLerJYG3
— Gyanendra Shukla (@gyanu999) December 29, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

