Nurse Cuts Doctor’s Private Parts | సామూహిక అత్యాచారం నుంచి తప్పించుకునేందుకు.. డాక్టర్ ప్రైవేట్ భాగాన్ని బ్లేడ్‌తో కోసిన నర్సు
Nurse Cuts Doctor's Private Parts | సామూహిక అత్యాచారం నుంచి తప్పించుకునేందుకు నర్సు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో బ్లేడ్‌తో డాక్టర్ ప్రైవేట్ భాగాన్ని కోసింది. హాస్పిటల్ నుంచి బయటకు పరుగెత్తిన ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. అక్కడకు చేరుకున్న పోలీసులు డాక్టర్‌తోపాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
పాట్నా: సామూహిక అత్యాచారం నుంచి తప్పించుకునేందుకు నర్సు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో బ్లేడ్‌తో డాక్టర్ ప్రైవేట్ భాగాన్ని కోసింది. (Nurse Cuts Doctor’s Private Parts) హాస్పిటల్ నుంచి బయటకు పరుగెత్తిన ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు డాక్టర్‌తోపాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గంగాపూర్‌లోని ప్రైవేట్ హెల్త్ సెంటర్లో ఒక నర్సు పని చేస్తున్నది. బుధవారం రాత్రి విధుల తర్వాత ఇంటికి వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతున్నది. ఇంతలో మద్యం సేవించిన ఆసుపత్రి నిర్వాహకుడైన డాక్టర్ సంజయ్ కుమార్, ఇద్దరు సహచరులతో కలిసి ఆ నర్సుపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. వారి నుంచి తప్పించుకునేందుకు ఆ నర్సు బ్లేడ్‌తో డాక్టర్ ప్రైవేట్ భాగాన్ని కోసింది. హాస్పిటల్ నుంచి బయటకు పరుగుతీసిన ఆమె ఒకచోట దాక్కొని పోలీసులకు ఫోన్ చేసింది.
కాగా, పోలీసులు వెంటనే ఆ ప్రైవేట్ క్లీనిక్‌కు చేరుకున్నారు. బాధిత నర్సును అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నించిన డాక్టర్ సంజయ్ కుమార్, అతడి ఇద్దరు అనుచరులైన సునీల్ కుమార్ గుప్తా, అవధేష్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. సగం మద్యం సీసా, నర్సు ఉపయోగించిన బ్లేడ్, రక్తంతో తడిసిన దుస్తులు, మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు నిందితులు ఆసుపత్రి లోపలి నుంచి లాక్ చేశారని, సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేశారని పోలీస్ అధికారి తెలిపారు. అయితే లైంగిక దాడి యత్నాన్ని ప్రతిఘటించి ముగ్గురిని ఎదుర్కొన్న ఆ నర్సు ధైర్యసాహసాలు ప్రశంసనీయమని అన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

