Nuclear Bunker | అమెరికా వాసులకు యుద్ధ భయం.. అణు బంకర్లకు భలే గిరాకీ
అమెరికా ప్రజలను మూడో ప్రపంచ యుద్ధం భయపెడుతున్నది. దీంతో అణు యుద్ధం వచ్చినా సురక్షితంగా ప్రాణాలను రక్షించే బంకర్లకు డిమాండ్ పెరిగిపోతున్నది.
- రోజురోజుకూ పెరుగుతున్న విక్రయాలు
Nuclear Bunker | న్యూఢిల్లీ, డిసెంబర్ 29: అమెరికా ప్రజలను మూడో ప్రపంచ యుద్ధం భయపెడుతున్నది. దీంతో అణు యుద్ధం వచ్చినా సురక్షితంగా ప్రాణాలను రక్షించే బంకర్లకు డిమాండ్ పెరిగిపోతున్నది. ఇప్పటికే Russia-Ukraine war, అవసరమైతే అణ్వాయుధాలు ప్రయోగిస్తామని రష్యా చేస్తున్న ప్రకటన, మరో వైపు ఉత్తర కొరియా, చైనా దేశాలు అణ్వాయుధ సంపత్తిని పెంచుకుపోవడం, పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. ఈ అన్ని కారణాలూ అమెరికా వాసులను బంకర్ల కొనుగోలుకు ప్రేరేపిస్తున్నాయి. దీంతో చాలా అమెరికా కుటుంబాలు అణు బంకర్లను కొనుగోలు చేస్తున్నాయి. వీటిని సుమారు 50,000 డాలర్ల వరకు పెట్టి కొంటున్నారని వాటిని తయారు చేసే సంస్థ డెయిలీ మెయిల్‌కు వెల్లడించింది. మునుపెన్నడూ లేనివిధంగా గత ఏడాది వీటి అమ్మకాలు తారస్థాయికి చేరుకున్నట్టు తెలిపింది.
బంకర్లలో అన్ని వసతులు
అమెరికాలోని ఓహియో కేంద్రంగా ఉన్న ఒక బంకర్ యజమాని టాడ్ స్టంప్ మాట్లాడుతూ తూర్పు ప్రాంతంలోని పెన్సిల్వేనియా, పశ్చిమ ప్రాంతంలోని కాలిఫోర్నియాలో వందలాది బంకర్లను అమ్మినట్టు చెప్పారు. బంకర్లంటే ఏదో చీకటిగా ఉండే ప్రదేశాలని భావించనక్కర్లేదు. సాధారణ గృహాల్లో ఉండే సదుపాయాలన్నీ ఇందులో ఉంటాయి. ఇక లగ్జరీ బంకర్లలో అయితే వంటగదులు, బెడ్రూమ్లతో పాటు కృత్రిమ కిటికీలు కూడా ఉండి మనం భూమి ఉపరితలంపైనే ఉన్న భావన కలిగిస్తాయి. ముందుగా నిర్మించి ఉన్న బంకర్లయితే పావు అంగుళం స్టీల్ ప్లేట్లతో తయారు చేస్తారు. అలా కాకుండా కావాల్సిన సైజులో షెల్టర్లు కావాల్సి వస్తే భారీ ఆర్సీపీ గోడలతో 8 నుంచి 20 అడుగుల పాటు వెయ్యి చదరపు అడుగులు, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తారు. కొందరైతే కొన్ని నెలల పాటు నివసించగలిగేలా బంకర్లలో సౌకర్యాలు కోరుతున్నారు.
వారి భయమే.. మా వ్యాపారం
కొంతమంది ప్రజలు నిత్యం ప్రపంచంలో జరిగే పరిణామాల పట్ల ఆందోళన చెందుతుంటారని, నిజంగా అది తమకే జరిగితే ఎలా అని భయపడుతుంటారని, అలాంటి వారే తమకు కస్టమర్లుగా మారుతారని బంకర్ యజమాని టాడ్ స్టంప్ తెలిపారు. ఒకవేళ అణుయుద్ధమే సంభవిస్తే ప్రాణాలతో బయటపడటానికి మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో బంకర్లను నిర్మించినట్టు తెలిపాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

