జైలు ఆవరణలో బాంబు.. నిర్వీర్యం చేసిన ఎన్ఎస్జీ
Burail jail | చండీగఢ్‌లోని బురైల్ జైలు వద్ద (Burail jail) భారీ ప్రమాదం తప్పింది. బురైల్ జైలు ఆవరణలో డిటోనేటర్ బయటపడింది. దీనిని ఎన్ఎస్జీ బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నిర్వీర్యం చేశారు. శనివారం
చండీగఢ్: చండీగఢ్‌లోని బురైల్ జైలు వద్ద (Burail jail) భారీ ప్రమాదం తప్పింది. బురైల్ జైలు ఆవరణలో డిటోనేటర్ బయటపడింది. దీనిని ఎన్ఎస్జీ బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నిర్వీర్యం చేశారు. శనివారం రాత్రి జైలు బయటి గోడ వద్ద పోలీసులు ఓ అనుమానిత సంచిని గుర్తించారు. దానిని పరిశీలించగా అందులో డిటోనేటర్, దాని పక్కన కాలిపోయిన కోడ్ఎక్స్ వైర్ ఉన్నది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిషేధించి, తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు స్క్వాడ్‌కు సమాచారం అందించారు.
దీంతో శనివారం ఉదయం రంగంలోకి దిగిన ఎన్ఎస్జీ బాంబు డిస్పోజల్ స్క్వాడ్ దానిని నిర్వీర్యం చేసింది. అయితే, అందులో ఉపయోగించిన పేలుడు పదార్థాలు ఏ రకమైనవి అనేది ఇంకా తెలియరాలేదని, దానిని సైన్యం మాత్రమే నిర్ధారిస్తుందని చండీగఢ్ ఎస్ఎస్పీ కుల్దీప్ చాహల్ తెలిపారు.
అయితే ఇది ఉగ్రవాద చర్యా లేదా జైలును బద్దలు కొట్టేందుకు చేసిన ప్రయత్నమా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారనే విషయం దర్యాప్తులో తేలుతుందని అధికారులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

