ఎస్సీవో సదస్సుకు అజిత్ దోవల్
NSA Ajith Doval: తజకిస్థాన్‌లో వచ్చేవారం జరిగే షాంఘై సహకార సంఘం (SCO) సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ పాల్గొననున్నారు.

న్యూఢిల్లీ: తజకిస్థాన్‌లో వచ్చేవారం జరిగే షాంఘై సహకార సంఘం (SCO) సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ పాల్గొననున్నారు. ఇతర దేశాల జాతీయ భద్రతా సలహాదారులు కూడా జూన్ 23, 24 తేదీల్లో జరిగే సమావేశాల్లో వ్యక్తిగతంగా హాజరవుతారు. కొవిడ్-19 నిబంధనల మేరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సదస్సులో పాకిస్థాన్ NSA మొయీద్ యూసఫ్ కూడా పాల్గొంటారు.
అయితే, ఈ సదస్సు సందర్బంగా భారత్, పాకిస్థాన్ ఎన్ఎస్ఏలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని భారత్, పాక్ సైన్యాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగీకారానికి వచ్చాయి. దీంతో నియంత్రణ రేఖ వెంబడి జమ్ము-కశ్మీర్లో కాల్పులకు తెరపడింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ఎన్ఎస్ఏలు సమావేశమవుతారా? అనే విషయంలో ఆసక్తి నెలకొంది.
అయితే, మార్చి, ఏప్రిల్ నెలల్లో భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఎస్ఎం ఖురేషీ ఒకే చోట కలిసిన సందర్భాలు వచ్చాయి. కానీ వారిద్దరూ కలిసి చర్చలు జరపలేదు. మార్చిలో తజకిస్థాన్‌లోని దుషాంబేలో ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ మీట్లో, ఏప్రిల్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. కానీ వారి మధ్య ద్వైపాక్షిక భేటీ జరుగలేదు. షాంఘై సహకార సంఘంలో భారత్, రష్యా, చైనా, పాకిస్థాన్, కజకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

