రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అజిత్ దోవల్ భేటీ..!
India-Russia | దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని రష్యాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
మాస్కో : దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని రష్యాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్పై బహుపాక్షిక భద్రతపై సమావేశంలో పాల్గొనేందుకు దోవల్ మాస్కోకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన భేటీలో అజిత్ దోవల్ ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత్ – రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం అమలు చేసే దిశగా పనులు కొనసాగించేందుకు అంగీకరించినట్లు పేర్కొంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో బుధవారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో దోవల్ మాట్లాడుతూ కాబూల్‌లో సమ్మిళిత, ప్రాతినిధ్య వ్యవస్థతోనే ఆఫ్ఘన్ సమాజానికి ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదం పెను ముప్పుగా మారిందని ఆయన పేర్కొన్నారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, దాయెష్ వంటి ఉగ్రవాద సంస్థలను ఎదుర్కొనేందుకు సభ్య దేశాల మధ్య కఠిన నిఘా, భద్రతా సహకారం అవసమన్నారు. ఆఫ్ఘనిస్తాన్ క్లిష్ట దశను ఎదుర్కొంటోందని, భారతదేశం ఆఫ్ఘన్ ప్రజలను వారి అవసరమైన సమయంలో సహకారం అందిస్తుందన్నారు. సంక్షోభ సమయాల్లో 40వేల మెట్రిక్ టన్నుల గోధుమలు, 60 టన్నుల మందులు, ఐదు లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు పంపినట్లు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

