No US role in ceasefire | కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు.. పాక్ నుంచి అణు దాడి సంకేతాలు లేవు
No US role in ceasefire | భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే పాక్ నుంచి ఎలాంటి అణు దాడి సంకేతాలు లేవని పేర్కొంది.
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. (No US role in ceasefire) అలాగే పాక్ నుంచి ఎలాంటి అణు దాడి సంకేతాలు లేవని పేర్కొంది. సోమవారం పార్లమెంటరీ కమిటీ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి సమాధానం ఇచ్చారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని తెలిపారు. సైనిక చర్యలు నిలిపివేయాలన్న నిర్ణయం రెండు దేశాల ద్వైపాక్షిక స్థాయిలో తీసుకున్నట్లు చెప్పారు.
కాగా, భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు తాను సహకరించినట్లు అమెరికా అధ్యక్షుడు సుమారు ఏడుసార్లు అన్నారు. దీనిపై భారత్ ఎందుకు మౌనంగా ఉన్నదని కొంతమంది ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. అయితే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఈ వాదనను ఖండించారు. ‘కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ఎలాంటి పాత్ర పోషించలేదు. మూడవ పక్షం ప్రమేయం లేని ద్వైపాక్షిక నిర్ణయం’ అని ఆయన అన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయని ఇండియా టుడే పేర్కొంది.
మరోవైపు భారత్, పాకిస్థాన్ మధ్య ఘర్షణ సాంప్రదాయ యుద్ధ పరిధిలోనే ఉన్నదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు. పాకిస్థాన్ నుంచి ఎలాంటి అణు దాడి సంకేతాలు లేవని చెప్పారు. మే 10న రెండు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో)లు అన్ని సైనిక చర్యలను నిలిపివేయడంపై ఒక అవగాహనకు వచ్చారని పలువురి సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
కాగా, చైనా సైనిక ఆయుధాలు, హార్డ్‌వేర్‌ను పాకిస్థాన్ వినియోగించడంపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ‘వారు (పాక్) ఏమి ఉపయోగించినా పర్వాలేదు. వారి వైమానిక స్థావరాలను మనం తీవ్రంగా ఢీకొట్టామన్నదే ముఖ్యం’ అని విక్రమ్ మిస్రి తెలిపారు. కోల్పోయిన భారతీయ యుద్ధ విమానాల సంఖ్య గురించి కొందరు సభ్యులు ప్రశ్నించారు. అయితే జాతీయ భద్రతా సమస్యగా పేర్కొంటూ సమాధానం చెప్పేందుకు మిస్రి నిరాకరించారు.
మరోవైపు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దని పార్లమెంట్ కమిటీ సభ్యులను విక్రమ్ మిస్రి కోరారు. ఆపరేషన్ సిందూర్ మొదటి దశ తర్వాత పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద లక్ష్యాలను మాత్రమే ధ్వంసం చేసినట్లు పాకిస్థాన్‌కు జైశంకర్ తెలియజేశారని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | మారిన మద్దతు లెక్కలు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీయే ‘మిషన్ 360’
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

