Second Booster Dose | దేశంలో కరోనా రెండో బూస్టర్ డోస్ అవసరం లేదు : ప్రభుత్వ వర్గాలు
ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా కలవరం మొదలైంది. ముఖ్యంగా చైనాతోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దీంతో భారత్‌లోనూ కరోనా నాలుగో వేవ్ భయం ప్రజలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తూ..
Second Booster Dose | ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా కలవరం మొదలైంది. ముఖ్యంగా చైనాతోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దీంతో భారత్‌లోనూ కరోనా నాలుగో వేవ్ భయం ప్రజలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తూ.. దేశంలో కొవిడ్ వ్యాప్తిని పరిశీలిస్తోంది. కొవిడ్ టెస్టులు, క్వారంటైన్ సదుపాయాలు, వ్యాక్సిన్ మొదలుకొని ఆసుపత్రుల్లో చేయాల్సిన ఏర్పాట్లపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తోంది.
ఇదే సందర్భంలో దేశంలో రెండో బూస్టర్ డోస్‌పై చర్చ నడుస్తోంది. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. కరోనా ముప్పు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి రెండో బూస్టర్ డోస్ అవసరం లేదని అభిప్రాయపడ్డాయి. కరోనా నిరోధానికి బూస్టర్ డ్రైవ్‌ను పూర్తి చేయడం ప్రభుత్వ మొదటి లక్ష్యం అని పేర్కొన్నాయి. ‘ప్రస్తుతం దేశంలో రెండో బూస్టర్ డోస్ అవసరం లేదు. ముందుగా బూస్టర్ డ్రైవ్‌ను పూర్తి చేయాలి’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇప్పటి వరకు మన దేశంలో 220.11(2,20,11,23,642) కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

