వేర్వేరు టీకాలతో ఇబ్బందేమీ ఉండదు!

- రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి
- యూపీలో టీకాలు మారడంపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్
న్యూఢిల్లీ, మే 27: ‘ఒకే వ్యక్తి రెండు వేర్వేరు టీకాల డోసులు వేసుకొంటే ఆ వ్యక్తిపై గణనీయమైన ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పడానికి లేదు. నిజానికి రెండు వేర్వేరు టీకాల డోసులను వేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే దీనిపై కచ్చితమైన అభిప్రాయానికి రావాలంటే మాత్రం మరింత పరిశోధన అవసరం’ అని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో 20 మందికి మొదట కొవిషీల్డ్ వేసి తర్వాత రెండో డోసు కొవాగ్జిన్ వేయటం కలకలం రేపింది. దీనిపై గురువారం విలేకరులు అడిగిన ప్రశ్నకు పాల్ స్పందిస్తూ.. ‘ఆ ఘటన నిజంగానే జరిగినా కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే మొదటి, రెండో డోసు ఒకే టీకా ఇవ్వాలని ఆరోగ్యసిబ్బందికి విజ్ఞప్తి చేస్తున్నా’ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

