భయపడాల్సిందేమి లేదు : ఎయిమ్స్ చీఫ్

ఢిల్లీ : కొవిడ్-19 తేలికపాటి వ్యాధి అని భయపడాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఆదివారం కరోనా వైరస్‌కు సంబంధించిన సమస్యలపై మేదాంత చైర్మన్ డాక్టర్ నరేష్ ట్రెహాన్, ప్రొఫెసర్, ఎయిమ్స్ మెడిసిన్స్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ నవీత్ విగ్, డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ సునీల్ కుమార్ కొవిడ్‌కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా గులేరియా మాట్లాడుతూ.. కొవిడ్-19 ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడితే ప్రజల్లో భయం నెలకొంది. ఈ భయం కారణంగా ప్రజలు తమ ఇళ్లలో ఇంజెక్షన్లు, రెమ్‌డెసివిర్ డ్రగ్, ఆక్సిజన్ సిలిండర్లను ముందస్తుగా నిల్వచేసుకోవడం ప్రారంభించారు. దీని కారణంగా సరఫరా కొరతను ఎదుర్కొంటున్నాం. ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించబడుతున్నాయని పేర్కొన్నారు.
కొవిడ్-19 అనేది సాధారణ ఇన్ఫెక్షన్ అన్నారు. 85 నుండి 90 శాతం మందిలో జ్వరం, జలుబు, శరీర నొప్పి, దగ్గు వంటి సాధారణ లక్షణాలనే చూస్తున్నాం. ఇటువంటి లక్షణాలుంటే రెమ్‌డెసివిర్ లేదా ఇతర పెద్ద డ్రగ్స్ అవసరం లేదు. సాధారణ ఇన్ఫెక్షన్లకు తీసుకునే మందులనే తీసుకోవచ్చు. ఏడు నుండి పది రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటారు. అంతేకాని మీ ఇంట్లో రెమ్‌డెసివిర్ లేదా ఆక్సిజన్ ఉంచాల్సిన అవసరం లేదన్నారు. కొవిడ్ తీవ్ర సంక్రమణకు 10 నుండి 15 శాతం మంది మాత్రమే గురవౌతున్నారు. వీరికి రెమ్‌డెసివిర్, ఆక్సిజన్ లేదా ప్లాస్మా వంటి అదనపు మందులు అవసరం అవుతాయి. ఐదు శాతం కంటే తక్కువ మంది రోగులకు వెంటిలేటర్ అవసరం ఉంటుందని ఆయన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

