Nirmala Sitharaman: బహీఖాతా ట్యాబ్లెట్‌తో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman: ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి సీతారామన్. ఎరుపు రంగు బహీఖాతా పౌచ్‌లో .. ట్యాబ్లెట్‌తో ఆమె పార్లమెంట్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ పౌచ్‌లోనే బడ్జెట్ డాక్యుమెంట్లు ఉన్నాయి. రాష్ట్రపతి ముర్ముకు పూర్తి స్థాయి బడ్జెట్‌కు చెందిన కాపీలను అందించారు.
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఇవాళ పార్లమెంట్లో 2024 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ ఉదయం ఆమె నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖకు వెళ్లారు. అక్కడ నుంచి బహీఖాతా తీసుకువచ్చారు. ఎరుపు రంగులో ఉన్న బహీఖాతాలో బడ్జెట్ డాక్యుమెంట్లు ఉన్నాయి. బహీఖాతా పౌచ్‌లో ట్యాబ్లెట్ ఉన్నట్లు తెలుస్తోంది.
రికార్డు స్థాయిలో ఏడవ సారి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ద్రవ్యోల్బణం సాధారణ ప్రజల జేబులకు చిల్లు పొడిచిన నేపథ్యంలో.. ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఏదైనా ఉపశమనం ఇస్తుందా అన్న కోణంలో జనం ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ డాక్యుమెంట్లతో మంత్రి సీతారామన్.. కాసేపటి క్రితం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బడ్జెట్ కాపీలను అందజేస్తారు.
ఈసారి కూడా గత ఏడాది తరహాలోనే పేపర్‌లెస్ బడ్జెట్‌ను మంత్రి సీతారామన్ ప్రజెంట్ చేయనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

