Nijjar probe | పన్నూ కేసులో అమెరికా దర్యాప్తునకు ఒకే.. నిజ్జర్ హత్య కేసులో కెనడాకు నో: భారత దౌత్యవేత్త
Nijjar probe | ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిన కేసులో అమెరికా (USA) దర్యాప్తునకు భారత (India) ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కెనడా (Canada) లోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ (Sanjay Kumar Verma) తెలిపారు. కానీ నిజ్జర్ హత్య కేసులో మాత్రం కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించబోదని ఆయన తేల్చి చెప్పారు.
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిన కేసులో అమెరికా (USA) దర్యాప్తునకు భారత (India) ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కెనడా (Canada) లోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ (Sanjay Kumar Verma) తెలిపారు. కానీ నిజ్జర్ హత్య కేసులో మాత్రం కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించబోదని ఆయన తేల్చి చెప్పారు. భారత్తో సమాచారం పంచుకునే విషయంలో రెండు దేశాల మధ్య తేడా ఉన్నదని, ఆ కారణంగానే భారత ప్రభుత్వం స్పందన కూడా వారి విషయంలో భిన్నంగా ఉన్నదని అన్నారు.
కెనడాలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసినంత వరకు పన్నూ హత్యకు కుట్ర కేసులో దర్యాప్తునకు సంబంధించి అమెరికా అధికారులు భారత్తో నిర్దిష్టమైన సమాచారాన్ని పంచుకున్నారు. అమెరికాలోని గ్యాంగ్స్టర్లు, మాదకద్రవ్యాల రవాణాదారులు, ఉగ్రవాదుల గురించి ఆ దేశం కీలక సమాచారం అందించింది. ఈ కుట్రలో భారత్లోని వారికి సంబంధం ఉండొచ్చని అమెరికా భావిస్తోంది. ఇక్కడ భారత్లోని వారికి సంబంధం అంటే ప్రభుత్వానికి అని కాదు. 140 కోట్ల మంది భారతీయుల్లో ఎవరో ఒకరికి అని అర్థం. న్యాయపరంగా ఆ సమాచారం సమర్థించదగినది కావడంతో అమెరికా దర్యాప్తునకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నది’ అని సంజయ్ వర్మ చెప్పారు.
అదేవిధంగా ‘ఇక నిజ్జర్ కేసు విషయానికొస్తే దీని దర్యాప్తునకు సంబంధించి కెనడా నుంచి ఎలాంటి నిర్దిష్టమైన సమాచారం లేదా ఆధారాలు అందలేదు. కేసు గురించి ఎలాంటి వివరాలు లేనప్పుడు మేం దానిపై ఎలా స్పందించగలం? అందుకే ఆధారాలివ్వండని మేం అడుగుతున్నాం. ఆ సమాచారం ఇవ్వనంత వరకు కెనడా దర్యాప్తుపై మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. ఈ రెండు కేసుల్లో భారత స్పందన భిన్నంగా ఉండటానికి కారణమిదే’ అని ఆయన తెలిపారు.
కాగా, ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూను అమెరికా గడ్డపై హత్య చేసేందుకు జరిగిన కుట్రను అగ్రరాజ్యం భగ్నం చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ ఘటనకు సంబంధించి భారత్తో అమెరికా చర్చించింది. దీనిపై ఇటీవల భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. అమెరికా పంచుకున్న సమాచారాన్ని సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయని తెలిపింది. అదేవిధంగా ఈ ఏడాది జూన్లో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవన్నీ నిరాధారమైన, కుట్రపూరిత ఆరోపణలేనని కొట్టిపారేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

