NIFT Results | న్యూఢిల్లీ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 60 నగరాల్లోని 72 సెంటర్లలో ఫిబ్రవరి 5వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు విడుదల చేసి, స్కోర్ కార్డులను ఎన్టీఏ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
ఈ ప్రవేశ పరీక్ష తర్వాత ప్రొవిజినల్ ఆన్షర్ కీ విడుదల చేసి ఎన్టీఏ.. ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. ఆ తర్వాత నిపుణులతో వెరిఫై చేసిన అనంతరం ఫైనల్ కీతో పాటు తాజాగా ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలను https://exams.nta.ac.in/NIFT వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.