NIA Raids: జస్విందర్తో లింకు ఉన్న 100 ప్రదేశాల్లో ఎన్ఐఏ సోదాలు..
NIA Raids: వేర్పాటువాద గ్రూపు సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) సభ్యుడు జస్విందర్ సింగ్ ముల్తానీకి లింకు ఉన్న 100 ప్రదేశాల్లో ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. దాదాపు ఆరు రాష్ట్రాల్లో ఆ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్, పంజాబ్, రాజస్తాన్, యూపీ, మధ్యప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
న్యూఢిల్లీ: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA Raids) ఇవాళ సుమారు వంద ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. నిషేధిత వేర్పాటువాద గ్రూపు సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) సభ్యుడు జస్విందర్ సింగ్ ముల్తానీకి లింకు ఉన్న ప్రదేశాల్లో ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. దాదాపు ఆరు రాష్ట్రాల్లో ఆ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్, పంజాబ్, రాజస్తాన్, యూపీ, మధ్యప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
చండీఘడ్‌లో గత ఏడాది మోడల్ బురెయిల్ జైలు వద్ద బాంబు పెట్టిన కేసులో జస్విందర్ సింగ్ ముల్తానీ అనుమానితుడు. లుథియానా కోర్టు పేలుడు ఘటనలో మాస్టర్‌మైండ్ అయిన అతన్ని 2021లో జర్మనీలో అరెస్టు చేశారు. టెర్రర్, నార్కోటిక్స్, స్మగ్లింగ్, గ్యాంగ్‌స్టర్ కేసుల్లో భాగంగా ఇవాళ ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. విదేశాల్లో ఉంటున్న గ్యాంగ్స్టర్లు.. ఖలిస్తానీ గ్రూపులకు ఫండింగ్ చేస్తూ ఉగ్రకార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు ఆరోపిస్తున్నారు.
ఎన్ఐఏకు చెందిన సుమారు 200 రెడ్ టీమ్ సభ్యులు సోదాల్లో పాల్గొంటున్నారు. ఎస్ఎఫ్జే వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నుకు సన్నిహితుడి జస్విందర్. రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్‌ను సింగూ బోర్డర్ వద్ద చంపాలని జస్విందర్ ప్లాన్ చేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

